back

తెలుగు ఇండస్ట్రీ లో నిజమైన జెంటిల్మెన్ మెగాస్టార్ చిరంజీవి .....



Share via:

40 సంవత్సరాల క్రితం ఎవరి అండదండలు లేకుండా తెలుగు సినిమా స్రవనిలోకి వచ్చి,
ఎన్ని కష్టాలు ఎదురైన వెనుకంజ వేయకుండా అన్నిటిని ఎదురొడ్డి,
నవరసాలలో తనకు తానే సాటి అనే విదంగా 30 సంవత్సరాల పాటు తెలుగు సినిమా మఖుతం లేని మహారాజుగా వెలుగొందుతున్న మెగాస్టార్ చిరంజీవి గారు ఈ తెలుగు సినిమా ప్రపంచం లో నిజమైన జెంటిల్మెన్ అని చెప్పచ్చు.

తనకు పోటి ఉన్న పెద్ద హీరోలైన, తన తర్వాతి తరం హీరోలైన లేక ఇతర శాఖల వాళ్ళతో అయిన ..అందరితో మంచి బంధం కలిగినవాడు చిరంజీవి మాత్రమే....

తన ఇంట్లో నే 7 మంది హీరోలున్నా కూడా ఇతర హీరోలు తీసిన సినిమాలు బాగుంటే వాళ్ళకి ఏదో ఒక రూపంలో తన అభినందనలు తెలపడం తనకే వీలైంది.

ఇప్పుడు కూడా మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘భరత్ అనే నేను’ సినిమాను చూసి చిరంజీవి ఏమన్నారో నిన్న సక్సెస్ మీట్ లో నిర్మాత దానయ్య మాటల్లో “'ఈ సినిమా చూసి చిరంజీవి గారు స్వయంగా ఫోన్ చేయడం ఆనందం కలిగించింది. మా చెల్లెళ్లు కూడా ఈ చిత్రాన్ని చూశారని మెగాస్టార్ అన్నారు. మంచి సినిమా చేశావని.. చాలా పెద్ద హిట్ అవుతుందని చిరంజీవి గారు చెప్పడం మరువలేను' అన్నారు.

తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్న రాంచరణ్ కూడా అందరు నటులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ అందరికి ఒక బ్రిడ్జి లాగ తయారవుతున్నాడు.

Tags : TFI, Telugu Film Industry, MegaStar Chiranjeevi

Write a comment ...
Post comment
Cancel