back

చిరంజీవి గురించి అంతగా వెతికారా?



Share via:

మెగాస్టార్ చిరంజీవి గురించి గూగుల్ లో ఈ ఏడాది అంతగా వెతికారా ? అని అనిపిస్తుంది ఈ విషయం వింటే.

ఈ ఏడాది 2018లో సౌత్ ఇండియాలో అత్యంతగా గూగుల్ సెర్చ్ లో వెతికిన సెలబ్రిటీగా మన మెగాస్టార్ చిరంజీవి గారు నిలిచారు. అవును... ఈ విషయాన్ని గూగుల్ ఇటివలే ప్రకటించింది.


మరి గూగుల్ లో చిరు గురించి అంతగా ఎం వెతికార అని చూస్తే, చిరు ప్రస్తుతం చేస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్రం అని తెలుస్తుంది. సైరా చిత్రం మొదటి తరం స్వాతంత్ర సమార యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతుంది.

కొద్దిరోజుల ముందు విడుదలైన ఈ చిత్ర టిజర్ అప్పట్లో యుట్యూబ్ లో కొత్త రికార్డులు సృష్టించింది. ఈ టిజర్ తో చిత్ర అంచనాలు మరింతగా పెరిగాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ అవ్వనున్నట్టు తెలుస్తుంది.


ఈ చిత్రంలో నయనతార మెయిన్ హీరోయిన్ రోల్ చేస్తుండగా... అమితాబ్ బచ్చన్, కిచ్చ సుదీప్, జగపతి బాబు, విజయ్ సేతుపతి, తమన్నాలు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Tags : Megastar Chiranjeevi, Google

Write a comment ...
Post comment
Cancel