back

అంబరీష్ ని చూసి ఏడ్చేసిన చిరు...



Share via:

కన్నడ రెబెల్ స్టార్ మరియు మాజీ మంత్రి అంబరీష్ అంత్యక్రియలు నిన్న బెంగళూరులో జరిగిన విషయం తెలిసిందే. సుమలత భర్తగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న అంబరీష్ కి హైదరాబాద్ లో చిరంజీవి కుటుంబంతో ఎంతో మంచి అనుబంధం ఉంది.

అంబరీష్ భార్య సుమలత ఒకప్పుడు 80 దశకంలో తెలుగులో టాప్ హీరొయిన్లలో ఒకరు. చిరంజీవితో శుభలేఖ మొదలు ఖైది ఆపై వేట నుంచి పసివాడి ప్రాణం దాకా చాలా సినిమాలలో నటించారు. ఆ మధ్య కన్నడ నటీనటుల సంఘానికి కొత్త బిల్డింగ్ నిర్మించినప్పుడు దాని ఓపెనింగ్ కి అంబరీష్ ప్రత్యేకంగా చిరంజీవిని ముఖ్య అతిధిగా పిలిచారు. వాటి తాలుకు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా. అంబరీష్-చిరు ఇద్దరు కలిసి నటించిన చిత్రం’ శ్రీమంజునాథ.

కాగా అంబరీష్ మరణ వార్త గురించి తెలిసిన వెంటనే.. షాక్ అయిన మెగాస్టార్ సతిసమేతంగా హుటాహుటిన బెంగుళూరు వెళ్లి అంబరీష్ పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రెబల్ స్టార్ అంబరీష్ తో తనకున్న స్నేహాన్ని చిరంజీవి గుర్తుచేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు.

Tags : Ambareesh, Kannada Rebel Star, Megastar Chiranjeevi

Write a comment ...
Post comment
Cancel