back

మెగాస్టార్ కి చేరిన బేబీ పాట ..



Share via:

ఈమధ్య బేబీ అనే ఒక ఆవిడ 'ప్రేమికుడు' సినిమాలోని 'ఓ చెలియా నా ప్రియ సఖియా' అనే పాట పాడడం.. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం తెలిసిందే.  ఆ వీడియో ఏఆర్ రెహమాన్ వరకూ చేరడంతో ఆమెను అభినందిస్తూ ఆమె వీడియోను షేర్ చేయడంతో ఆమె మరింత పాపులర్ అయింది. అంతేగాక అన్ని న్యూస్ చానల్స్ వాళ్ళు ఆవిడని హైదరాబాద్ కి పిలిపించుకుని ప్రోగ్రామ్స్ చేస్తున్నాయి.  పొలం పనులు చేసుకుంటూ జీవించే 40 సంవత్సరాల బేబీ సొంత ఊరు తూర్పుగోదావరి జిల్లా వడిసెలేరు గ్రామం.  ఇప్పటికే ఈమెను సింగర్ గా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేస్తానని సీనియర్ సంగీత దర్శకుడు కోటి మాటిచ్చారట.

అయితే ఆవిడ ఇంటర్వూస్ లో తన ఆరాధ్య నటుడు చిరంజీవి అని చెప్పుకొచ్చారు. ఈ విషయం తెల్సిన చిరంజీవి, కోటి ద్వారా ఆమెను తన ఇంటికి పిలిపించుకుని సత్కరించారు. చిరంజీవిని చూడగానే ఎమోషనల్ అయిన బేబీ అయన కాళ్ళపై పడి నమస్కరించిందట.

మిమ్మల్ని కలుస్తానని ఎప్పుడూ అనుకోలేదని.. ఈ జన్మకిది చాలని చెప్పిందట.  చిరంజీవి కూడా మీరు మట్టిలో మాణిక్యం అని.. మీ గొంతులో ప్రత్యేకత ఉందని.. మీకు ఫిలిం ఇండస్ట్రీలో మంచి భవిష్యత్తు ఉందని అభినందించారట. అంతేగాక ఆమెతో రుద్రవీణలో పాట పాడించుకుని మరి ఆనందించారు. ఆ వీడియో మీ కోసం...

Tags : Megastar Chiranjeevi, Singer Baby, Koti

Write a comment ...
Post comment
Cancel