back

చిరంజీవి ని మెగాస్టార్ చేసిన దర్శకనిర్మాత ఇకలేరు ..



Share via:

ప్రముఖ దర్శకుడు విజయ బాపినీడు అనారోగ్య కారణంతో ఈ రోజు మృతి చెందినారు. ఆయన పేరు వింటే ఇప్పటి జనాలకు తెలియకపోవచ్చు కాని, 1980, 90 లలో సిని జనాలకు సుపరిచితుడు. 30కి పైగా సినిమాలకు నిర్మాతగా 20 సినిమాలకు దర్సకత్వం వహించి తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక పేజి రాసుకున్నవారు బాపినీడు. చిరంజీవితో పట్నం వచ్చిన పతివ్రతలు నుంచి వరుసబెట్టి నిర్మాతగా సినిమాలు తీసిన విజయ బాపినీడు ఆ తరువాత ‘మగమహారాజు’ సినిమాతో ధర్సకత్వంలోకి వచ్చారు. అక్కడ 6 సినిమాలు చిరంజీవితోనే తీయడం అందులో ఎక్కువ బాగం విజయాలు సాధించడంతో ఆయన చిరంజీవి కాంబినేషన్ పైన యమ క్రేజ్ ఉండేది. చిరంజీవి పైన ప్రత్యేక అభిమానంతో ‘చిరంజీవి’ అనే మాస పత్రిక కేవలం చిరంజీవి అభిమానుల కోసం నడిపిన వ్యక్తి బాపినీడు. గ్యాంగ్ లీడర్ సినిమాతో చిరంజీవిని మెగాస్టార్ చేసిన దర్శకుడు ఈయనే.


ఆయన మృతికి సంతాపం ప్రకటించిన చిరంజీవి చెప్పిన మాటలు వింటే చిరంజీవి కి ఆయన ఎంతటి అండదండ గా ఉన్నారో మనకి తెలుస్తుంది. చిరనజీవి ఏమన్నారంటే ..

“‘‘ఇవాళ నాకెంతో దుర్దినం. విజయ బాపినీడు గారు మరణించారనేది నమ్మలేక పోతున్నా. ఆయన నన్ను ఓ కొడుకులా, ఓ తమ్ముడిలా చూసుకునే వారు. ఆయనతో నాకున్న అనుబంధం కేవలం ఓ దర్శకుడు, నిర్మాతలా ఉండేది కాదు. నా మనసుకు అతి దగ్గరైన వ్యక్తి ఆయన. వారితో నా పరిచయం ‘పట్నం వచ్చిన పతివ్రతలు’ సినిమా నుంచి మొదలైంది. అప్పటి నుంచి ఆరు సినిమాలు ఆయన నాతో చేయడం జరిగింది. ‘ఇతర హీరోలతో కూడా మీరు సినిమాలు చేయొచ్చు కదా’ అని ఆయనతో అంటూ ఉండేవాడి. ‘మీతో సినిమాలు తీయడం ప్రారంభించిన తర్వాత ఆ కంఫర్ట్ గానీ, సెంటిమెంట్ గానీ మరొకరితో నాకు కుదురడం లేదు. వేరే వారితో చేయలేకపోతున్నాను’ అని చెబుతూ చాలా కాలం నా పట్ల ఆ అభిమానాన్ని, ప్రేమను చూపించిన గొప్ప వ్యక్తి ఆయన.

నేను హైదరాబాద్కు షిఫ్ట్ అయిన కొత్తలో ఎక్కడ ఉండాలి అని అనుకుంటున్న సమయంలో ‘హైదరాబాద్లో నా గెస్ట్ హౌస్ ఉంది. మీరు అందులో ఉండొచ్చు’ అని చెప్పి.. పై ఫ్లోర్లో ఉండే వారిని కిందకు పంపించి, పై రెండు ఫోర్లు నాకు ఇచ్చారు. చాలా కాలం అక్కడే ఉన్నాను. ఎప్పుడూ నా పై తమ్ముడిలా, కొడుకులా వాత్సల్యం చూపించేవారు. ఆయనతో ఎన్నో స్వీట్ మెమొరీస్. ఒకరోజు ‘మగమహారాజు’ 100 రోజుల ఫంక్షన్ జరుగుతుంటే.. ఓ ఏనుగును నాకు బహుమతిగా ఇచ్చారు. ఇదేమిటండీ దీన్ని నేనేం చేసుకోనూ! అంటే.. ‘మీతో నాకు ఉన్న అనుబంధానికి, మీరు నా పట్ల చూపించే ప్రేమకు తగ్గట్టుగా ఏ బహుమతి ఇస్తే బాగుంటుందని ఆలోచించాను. ఏనుగును ఇస్తే దానికి మ్యాచ్ అవుతుందనిపించింది. అందుకే దీనిని ఇచ్చాను’ అంటూ నా మీద ప్రేమను అలా చూపిన గొప్ప మనసున్న మనిషి ఆయన. అలానే ‘గ్యాంగ్ లీడర్’ ఫంక్షన్ను ఒకే రోజు నాలుగు సిటీస్లో గ్రాండ్గా జరిపించిన అరుదైన రికార్డ్ మా ఇద్దరి కాంబినేషన్లో ఉంది. ఆయన ఏం చేసినా.. చాలా వినూత్నంగా, కొత్తగా ఉంటుంది. ముఖ్యంగా నా అభిమానులకు ఆయన అంటే చాలా ఇష్టం. వారికి ఎంతో దగ్గరగా ఉండేవారు. దానికి కారణంగా ‘చిరంజీవి’ అనే మ్యాగజైన్ను ఆయన పబ్లిషర్గా, ఎడిటర్గా తీసుకొచ్చారు. అందులో నాకు సంబంధించిన ఫోటోలను, వార్తలను ప్రత్యేకంగా పొందుపరిచి అందించేవారు. బాపినీడు గారి మ్యాగజైన్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులంతా ఎదురుచూసేలా చక్కగా ప్రింట్ చేసేవారు. ఆ రకంగా కూడా నా మీద ప్రేమ చూపించారు. అలాంటి వ్యక్తిని ఇవాళ కోల్పోవడం అనేది చాలా బాధకరంగా ఉంది. చాలా దురదృష్టంగా భావిస్తున్నాను. బాపినీడు గారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులకు మానసిక స్థైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ, నా సానుభూతిని తెలియచేస్తున్నాను’’ అని చిరంజీవి తెలిపారు.

ఫొటోస్ : విజయ బాపినీడుకి నివాళులు అర్పించిన చిరంజీవి

Tags : Chiranjeevi, Vijaya Bapineedu

Write a comment ...
Post comment
Cancel