back

చిన్నారిని కాపాడిన ఫైర్ మాన్ కి చిరంజీవి బహుమతి



Share via:

భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ లోని గౌలిగూడలో దివ్య అనే నాలుగేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు నాలాలో పడింది. ఫైర్‌మెన్‌ క్రాంతి కుమార్ సాహసోపేతంగా చిన్నారి ప్రాణాలు కాపాడిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని వార్తా పత్రికల ద్వారా తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి క్రాంతి కుమార్ ను అభినందించి తన చిరంజీవి చారిటబుల్ ట్రస్టు ద్వారా లక్ష రూపాయలను బహుమతిగా అభినందించారు. ఆ చెక్కును క్రాంతి కుమార్ కు అల్లు అరవింద్ అందజేశారు. క్రాంతి కుమార్ తో పనిచేసిన ఇతర సిబ్బందిని కూడా చిరంజీవి అభినందించారు.

Tags : Chiranjeevi, Kranthi Kumar, Allu Arvind

Write a comment ...
Post comment
Cancel