back

హాసినీని అభినందించిన చిరంజీవి...



Share via:

హాసిని అనే 7 ఏళ్ల చిన్నారి గుర్తుందా? శిల్ప కళా వేదికలో జరిగిన మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే ఈవెంట్లో ఆయన నటించిన 150 సినిమాలను గడగడా చెప్పేసి అందరినీ ఆశ్చర్యంతో ముంచెత్తింది. అంతేకాదు.. ఆ సినిమాలు ఏ రోజున రిలీజ్ అయ్యాయి? ప్రొడ్సూసర్ ఎవరు? డైరెక్టర్ ఎవరు? తదితర అన్ని విషయాలనూ చెప్తానని వెల్లడించింది. శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని చిరు సినీ ప్రస్థానంతో పోల్చి ఏమాత్రం తడుముకోకుండా అనర్గళంగా చెప్పేసి అక్కడున్న వారందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

 

వయసు ఏడేళ్లే కానీ ఎంతో పరిపక్వతతో చెప్పిన తీరు అందరినీ ఆకట్టుకుంది. అక్కడ ఉన్న వాళ్ళంతా లేచి నిలబడి ఆ పాపని అభినందించారు. ఆ సమయంలో చిరు అక్కడ లేరు కానీ తర్వాత విషయం తెలుసుకున్న ఆయన హాసినిని ఇంటికి పిలుపించుకుని మరీ అభినందించారు. హాసిని తన తల్లిదండ్రులు, అన్నతో కలిసి చిరు ఇంటికి వెళ్లింది. చిరు, రామ్ చరణ్.. చిన్నారిని అభినందించారు.

Tags : Chiranjeevi congratulated child Hasini, Megastar Birthday Celebrations

Write a comment ...
Post comment
Cancel