back

“అల్లూరి సీతారామరాజు” గా మెగాస్టార్ చిరంజీవి..!



Share via:

పై టైటిల్ చూసి మెగాస్టార్ చిరంజీవి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గా కొత్త సినిమా చేస్తున్నాడుఅని అనుకునేరు అల అయితే మీరు తప్పులో కాలేసినట్లే... కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పైన రామచరణ్ నిర్మిస్తున్న సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ పిరియాడికల్ మూవీలో తెల్లదొరలను గడగడలాడించిన మన్యం వీరుడు అల్లూరి పాత్ర కూడా కనిపించబోతోందట.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని బ్రిటిష్ సైన్యం ఉరి తీసిన తరువాత కాలంలో నరసింహ రెడ్డి స్ఫూర్తితో మళ్లీ బ్రిటిష్ సైన్యం పై ఎవరెవరు తిరుగుబాటు చేశారనే అంశాల ఆధారంగా కొంతమంది విప్లవకారులను ఈ చిత్రంలో చూపించనున్నారు.

ఆ విప్లవకారుల గెటప్స్ లోనూ మెగాస్టారే కనిపిస్తారట. అలాగే అల్లూరి సీతారామరాజు గెటప్ లోనూ మెగాస్టార్ ప్రత్యేకంగా కనిపించనున్నారు. ఇదే ఈ చిత్రానికి క్లైమాక్స్ అని కూడా తెలుస్తోంది. నరసింహారెడ్డి ఉరి తీయడంతో ముగిసే ఈ సినిమా కథ తెలుగు ప్రేక్షకులకు మరియు చిరంజీవి అభిమానులకు నచ్చే విధంగా ఉండాలని దర్శకుడు ఇలా ప్రయత్నిస్తున్నారంట

Tags : Chiranjeevi, Syeraa Narasimha Reddy, Ram Charan

Write a comment ...
Post comment
Cancel