back

మహేష్ బాబుని మెచ్చుకున్న చిరంజీవి...!



Share via:

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఏషియన్ సినిమాస్ సంస్థతో కలిసి మల్టీప్లెక్స్ నిర్మించిన సంగతి అందరికి తెలిసిందే. మహేష్ బాబు ఏఎంబి సినిమాస్ ఈమధ్యే ప్రారంభమై సినీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ప్రేక్షకులకు వరల్డ్ క్లాస్ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ పొందేలా అధునాత హంగులతో గచ్చిబౌలి ఏరియాలో ఈ మల్టీప్లెక్స్ నిర్మించారు మహేష్ బాబు.

సాధారణ ప్రేక్షకులే కాదు.. పలువురు సినీ సెలబ్రిటీలు కూడా ' ఏఎంబి సినిమాస్' లో సినిమా చూడడానికి ముచ్చట పడుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్ కలిసి అందులో సినిమా వీక్షించి మహేష్ బాబు పనితనాన్ని ప్రశంసించారు. ఇక 'ఏఎంబి సినిమాస్' లో సినిమా వీక్షించిన అనుభవం బాగుందని, అందులోనే వసతులు బాగున్నాయని మెచ్చుకున్నారట. స్క్రీన్‌తో పాటు సౌండ్ క్వాలిటీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారట.

చిరంజీవి, అల్లుఅరవింద్ @ఏఎంబి సినిమాస్

Tags : Mahesh Babu, Chiranjeevi, AMB Cinemas

Write a comment ...
Post comment
Cancel