back

రామ్ చరణ్ వేడుకకి చిరంజీవి & కే.టీ.ఆర్



Share via:

బోయపాటి - రామ్ చరణ్ ల కాంబోలో డి.వి.వి.దానయ్య నిర్మించిన సినిమా ‘వినయ విధేయ రామ’. ఈ సినిమా ఆడియో కం ట్రైలర్ రిలీజ్ లతో కూడిన ప్రీ-రిలీజ్ వేడుకను ఈ నెల 27న హైదరాబాద్ లో యూసుఫగూడ లోని పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్నారు. ఇక్కడే ఇంతకముందు చరణ్ ‘ధ్రువ’ సినిమా వేడుక కుడా జరిగింది.

అయితే ఈ వేడుకకు కు మెగాస్టార్ చిరంజీవితో పాటు తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు. కేటీఆర్ ఇంతకముందు ఇదే పోలీస్ గ్రౌండ్స్ లో జరిగిన రాంచరణ్ ధ్రువ వేడుకకు కుడా హాజారు అయ్యారు.


ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన ‘భరత్ అనే నేను’ ఫెమ్ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా సీనియర్ హీరో, హీరోయిన్లు ప్రశాంత్ మరియు స్నేహ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తునారు.

Tags : Ram Charan, Chiranjeevi, KTR, Vinaya Vidheya Rama Pre-Release event

Write a comment ...
Post comment
Cancel