back

మలయాళం సినిమా రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్న చరణ్



Share via:

రామ్ చరణ్ హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా దృష్టి పెట్టాడు. ఈ మధ్య మలయాళీ బ్లాక్ బస్టర్ చిత్రం ‘లూసిఫెర్’ రైట్స్ కొన్న సంగతి తెలిసిందే. ఆ చిత్రాన్ని ఇప్పుడు తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాడు. తాజాగా ఆయన మరో మలయాళం సినిమా రైట్స్ కొన్నట్టు సమాచారం.

మలయాళంలో సూపర్ హిట్టయిన డ్రైవింగ్ లైసెన్స్ అనే చిత్రం రైట్స్ రామ్ చరణ్ భారీ మొత్తం ఇచ్చి సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది. రామ్ చరణ్ ఈ రీమేక్‌ను తన కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నిర్మించనున్నాడని టాక్. ఇదివరకే తన సొంత బ్యానర్ లో సైరా నరసింహారెడ్డి చిత్రం తన తండ్రి చిరంజీవితో నిర్మించిన విషయం తెలిసిందే. అయితే ఈ రీమేక్ లో వెంకటేష్ అయితే బాగుంటుంది అని చరణ్ అనుకుంటున్నాడని సమాచారం. లేదా వేరే హీరోలు ఎవరితో అయినా నిర్మిస్తాడా? మెగా హీరోల్లోనే ఎవరితోనైనా చేస్తాడా అన్నది తెలియాల్సి ఉంది. వెంకటేష్ హీరోగా అనుకుంటే మాత్రం కొణిదెల బ్యానర్ లో మెగా ఫామిలీ కాకుండా వేరే హీరో చేసే తొలి చిత్రం ఇదే.

డ్రైవింగ్ లైసెన్స్ సినిమా కథ ఏమిటంటే… ఒక సూపర్ స్టార్ హీరోకు తన డ్రైవింగ్ లైసెన్స్ తప్పక రెన్యువల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మోటార్ వెహికల్ ఆఫీసర్ గా తన వీరాభిమాని ఉండటం విశేషం. అయితే కొన్ని అనుకోని సంఘటనల వల్ల వారిద్దరూ బద్దశత్రువులుగా మారిపోతారు. అక్కడ నుండి ఏమైంది అనేది అసలు కథ.

Tags : Ram charan, Malayalam remake, Venkatesh, Chiranjevi

Write a comment ...
Post comment
Cancel