back

రామ్ చరణ్ తో చిందేయనున్న కేథరిన్..?



Share via:

రామ్ చరణ్ నటిస్తున్న వినయ విదేయ రామ లోని స్పెషల్ సాంగ్ కోసం బోయపాటి ఇప్పటికే ఒక భారీ సెట్ సిద్ధం చేసాడు. ఆ పాట మినహా అంతా పూర్తైన ఈ సినిమాలో ఆ పాట కోసం చరణ్ పక్కన ఆడేందుకు ఒక హీరోయిన్ కోసం వెతుకులాట ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తుంది.

సరైనోడులో ఒక ముఖ్య పాత్ర చేసిన కాథరిన్ తెరెసాను బోయపాటి ఎంచుకున్నాడు అంటున్నారు. తన సినిమా జయ జానకి నాయక లో స్పెషల్ సాంగ్ లో చేసిన కాథరిన్ అయితే బడ్జెట్ మరియు కావాల్సిన అందం రెండు వర్కౌట్ అవుతాయని బోయపాటి ఫిక్స్ అయినట్లు బోగొట్ట.

అయితే ఇక్కడ ఇంకొక చిక్కు కూడా ఉంది,

రాంచరణ్ నిర్మించిన ఖైది నెం.150 సినిమాలో కూడా చిరంజీవి పక్కన ఓక స్పెషల్ సాంగ్ కోసం కాథరిన్ ని తీసుకుని తర్వాత తను యూనిట్ సభ్యులతో సరిగా ప్రవర్తించలేదని తీసేసి లక్ష్మి రాయ్ తో ఆ పాట షూట్ చేసారు. మరి ఇప్పుడు కాథరిన్ ని చరణ్ ఒప్పుకుంటాడ అనేది చూడాలి..?

Tags : Vinaya Vidheya Rama, Ram Charan, Catherine Tresa

Write a comment ...
Post comment
Cancel