back

బోయపాటి - రాంచరణ్ సినిమా విశేషాలు...



Share via:

రంగస్థలం హిట్ తరువాత రాంచరణ్ నటిస్తున్న బోయపాటి సినిమా కి చాల ప్రత్యేకతలు ఉన్నాయి. హీరో లేకుండానే రెండు షెడ్యూల్లు పూర్తి చేసుకుంది ఈ సినిమా.. ఈ సినిమా నటీనటుల లిస్టు కూడా చాల పెద్దది. వివేక్ ఒబెరాయ్, స్నేహ, ప్రశాంత్, నవీన్ చంద్ర, సుదీప్, కైరా అద్వానీ ఇలా చాల ఇప్పుడు కొత్తగా శ్రీకాంత్ కూడా ఈ సినిమాలో ఉన్నాడని తెలుస్తుంది. ఇంతటి భారీ తారాగణంతో బోయపాటి ఎటువంటి సినిమా తీస్తున్నాడు అనేది ఊహకు అందటం లేదు.

ఇంతకు ముందు ఈ సినిమా పేరు గురించి కొన్ని పేర్లు బయటికి వచ్చాయి. ఈ చిత్రానికి ‘రాజవంశస్థుడు, రాజమార్తాండ’ వంటి టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్టు గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి.

ఈ వార్తల్లో ఎలాంటి నిజంలేదని, సినిమాకు ఇంకా టైటిల్ పెట్టనేలేదని చిత్ర సన్నిహిత వర్గాలు ద్వారా తెలుస్తోంది. డివివి. దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం దశరాకు వుడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. రామ్ చరణ్ ఇటీవల చిత్రం ‘రంగస్థలం’ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.”

రివ్యూ: నా పేరు సూర్యలో విశ్వరూపం చూపించిన అల్లు అర్జున్

Tags : Boyapati Srinu, Ram Charan

Write a comment ...
Post comment
Cancel