back

బోయపాటి - అఖిల్ తో రాంచరణ్ సినిమా



Share via:

టైటిల్ చూడగానే రామచరణ్ ఇంకో మల్టిస్టారర్ ఒప్పుకున్నారేమో అని అనుకునేరు, కాని ఇది వేరు. అఖిల్ ని హీరోగా బోయపాటి దర్శకత్వంలో నిర్మాతగా రాంచరణ్ ఒక సినిమా చేస్తున్నాడని ఇండస్ట్రీ టాక్. ‘హలో’ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో మనమందరం చూసాం చరణ్ ని అఖిల్ పెద్దన్నయ్య అని సంబోదించడం.

మరి ఇప్పుడు ఈ కొత్త కథ ఏంటంటే ..
‌చరణ్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘వినయ విధేయ రామ’ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. దీని తర్వాత అఖిల్‌ హీరోగా ఓ సినిమా చేయడానికి బోయపాటి శ్రీను సన్నాహాలు చేస్తున్నారట! అఖిల్‌, బోయపాటి మధ్య కథాచర్చలు జరిగాయని, ఇద్దరూ కలిసి సినిమా చేయాలని నిశ్చయించుకున్నారని అంటున్నారు. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్‌ పతాకంపై రాంచరణ్ నిర్మించనున్నారని ఫిల్మ్‌నగర్‌ టాక్‌.

ప్రస్తుతం అఖిల్‌ ‘మిస్టర్‌ మజ్ను’ సినిమా చేస్తున్నారు. ‘మిస్టర్‌ మజ్ను’ విడుదలైన తర్వాత బోయపాటి సినిమా కోసం ప్రిపేర్‌ అవుతారట! మార్చి 2019 నుంచి సినిమా సెట్స్‌ పైకి వెళుతుందట!!

Tags : Ram Charan, Akhil, Boyapati, Konidela Productions

Write a comment ...
Post comment
Cancel