back

‘ఆర్ఆర్ఆర్’ సెట్ లో బాలీవుడ్ స్టార్ హీరో



Share via:

ఎస్.ఎస్.రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఇందులో రామ్ చరణ, ఎన్టీఆర్ కథానాయకులుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ లెవల్లో రూపొందిస్తున్నారు జక్కన్న. సినిమాకు పాన్ ఇండియా అప్పీల్ తీసుకురావడం కోసం అన్ని పరిశ్రమల నుండి నటీనటుల్ని తీసుకున్నారు. బాలీవుడ్ నుండి ఆలియాతో పాటు స్టార్ నటుడు అజయ్ దేవగన్ ను తీసుకున్నారు.

ఇప్పటికే షూటింగ్ జరుగుతుండగా అజయ్ దేవగన్ ఈరోజు నుండి చిత్రీకరణలో జాయిన్ అయ్యారు ఈ విషయం ‘ఆర్ఆర్ఆర్’ టీం ట్విట్టర్ ఖాతాలో తెలుపుతూ అజయ్ దేవగన్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పింది. సుమారు రూ.400 కోట్ల వ్యయంతో డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఈ యేడాదిలోనే విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో జు .ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో మరియు రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపిస్తారని తెలిసిన విషయమే.

Tags : RRR, Rajamouli, Ajay Devagan, Alia Bhatt

Write a comment ...
Post comment
Cancel