back

RRR కోసం రెడీ అయిన హిందీ నిర్మాత..



Share via:

కరణ్ జోహార్ పేరు వినగానే మనకు ఆయన తీసిన అద్భుతమైన సినిమాలు గుర్తుకు వస్తాయి... అందులో 'దిల్ వాలే దుల్హానియే లే జాయేంగే', 'కుచ్ కుచ్ హోతా హై', 'కభి కుషీ కభి గం', 'మై నేమ్ ఇస్ ఖాన్' వంటి చిత్రాలు దేశవ్యాప్తంగా ఆయనికి అభిమానులను చేకూర్చాయి. అలాంటి వ్యక్తి నిర్మాతగా మారి సినిమాలు తీయగా అవి చాల వరుకు నిరాశనే మిగిల్చాయి. కానీ బాహుబలి 1 & 2 లను హిందీలో రిలీజ్ చేసిన కరణ్ తన పూర్వ వైభవాన్ని మళ్ళి అందుకున్నాడు. సినిమాలో ఉన్న సత్తాతో పాటుగా కరణ్ జోహార్ అసోసియేషన్ వల్లే నార్త్ ఇండియాలో అంత ఆదరణ దక్కిందని చెప్పడంలో అతిశయోక్తి ఏమీ లేదు. భారీ రిలీజ్ నెట్ వర్క్ తో పాటుగా బాలీవుడ్ మీడియాలో 'బాహుబలి' కి ఒక డైరెక్ట్ హిందీ సినిమాకు ఎంత ప్రాముఖ్యత ఇస్తారో అంత కవరేజ్ ఇప్పించడంలో కరణ్ జోహార్ కీలక పాత్ర పోషించాడు. దానికి తగ్గట్టే లాభాలు.. హిందీ ఆడియన్స్ చేత ప్రశంసలు అందుకున్నాడు. దీంతో ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ రెప్యుటేషన్ కూడా మరింతగా పెరిగింది.  అందుకే ఈసారి రాజమౌళి సినిమాను కూడా వదలదలుచుకోలేదట.  రాజమౌళి, నిర్మాత దానయ్య తో ఇప్పటికే కరణ్ జోహార్ టచ్ లో ఉన్నాడని, హిందీ వెర్షన్ #RRR కోసం కళ్ళుచెదిరే మొత్తాన్ని ఆఫర్ చేశాడని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను వేరే బాలీవుడ్ నిర్మాత చేతికి పోకుండా ఇప్పటి నుండే కర్చీఫ్ వేసి పెడుతున్నాడన్నమాట.

Tags : RRR Movie Hindi, Karan Johar, Rajamouli, Ram Charan, NTR

Write a comment ...
Post comment
Cancel