back

సైరా కోసం బాలీవుడ్ బామ



Share via:

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న సైరా నరసింహారెడ్డి సినిమా షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుపుకుంటుంది.

ఈ సినిమా షూటింగ్లో బిజీగా గడుపుతూ మధ్య మధ్యలో విరామం తీసుకుంటున్న చిరంజీవి.... ఈ సినిమాని ఎలాగైనా ఈ ఏడాది చివరకి పూర్తి చేసి కొత్త సినిమాని ప్రరంబించాలనుకున్టున్నారు.

ఇక విషయానికి వస్తే... ఇప్పటికే నయనతార, తమన్నాలతో నిండిన సైరాలో బాలీవుడ్ భామని తీస్కోడానికి చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తుంది. ఆ భామ మరెవరో కాదు... ఈ మధ్యనే కాలా సినిమాలో సూపర్ స్టార్ రజిని పక్కన నటించి మెప్పించిన 'హుమా ఖురేషి'.

ఇప్పటికే చిత్ర యూనిట్ హుమాని కలిసి కథా చర్చలు జరిపినట్టు సమాచారం. ఇక హుమా ఖురేషి పచ్చ జెండ ఊపిందో లేదో తెలియాల్సి ఉంది.

Tags : Megastar Chiranjeevi, Syeraa Narasimha Reddy, Huma Qureshi

Write a comment ...
Post comment
Cancel