back

200 కోట్లు దాటేసిన రంగస్థలం



Share via:

మొన్న శనివారం హైదరాబాద్ లోని మంజీరా మాల్ లో ఒక వృద్ధ జంట సినిమా టికెట్స్ కౌంటర్ దగ్గర ఉన్నారు. నేను అవెంజేర్స్ మూవీ కోసం ఒక కౌంటర్ క్యూ లో ఉండగా వాళ్ళు రంగస్థలం సినిమా టికెట్స్ అడుగితే నో టికెట్స్ అని సమాధానం వచ్చింది. నేను పెద్ద వాళ్ళు కదా అని దగ్గరలో ఉన్నఫోరం మాల్ లో ట్రై చేయండి అని చెప్తే వాళ్ళు చెప్పిన సమాధానం నాకు ఆశ్చర్యం వేసింది, వాళ్ళు ఏమ్మన్నారంటే “ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నాం బాబు, అక్కడ రేపటికి కూడా లేవు”.. నాకు నమ్మ బుద్ది గాక అన్ లైన్ లో చూస్తే ఆశ్చర్యం సినిమా విడుదలైన 5వ వారంతం కూడా టికెట్స్ లేకపోవడం......

ఈ విషయం చెప్పకనే చెప్తుంది ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందనే విషయం. భరత్ అనే నేను సినిమా హిట్ టాక్ కాని, దేశాన్ని ఊపేస్తున్న అవెంజర్స్ కాని దీని పరుగును ఆపట్లేదు. అందుకేనెమో సినిమా యూనిట్ కూడా నిన్నటితో 200 కోట్ల గ్రాస్ కలక్షన్స్ వచ్చేసినట్లు ప్రకటించాయి, ఇక ఈ సినిమా వ్యాపారంలో ఉన్న వాళ్ళు బాగా లాబాలు రాబత్తగా ఈ సినిమా ఇంకా వాటాలు సాధిస్తూ 50 రోజులకి పరుగులు తీస్తుంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 120 కోట్ల షేర్ వచ్చినట్లు ఇండస్ట్రీ బోగట్టా...

Tags : Ram Charan

Write a comment ...
Post comment
Cancel
Srinivas chiru
2018-05-01 08:44:07

Jai Rc


Reply
Post comment
Cancel