back

వరుణ్ అంతరిక్షం పైన విష ప్రచారం మొదులెట్టిన బాలయ్య ఫాన్స్



Share via:

ఈ రోజు వరుణ్ తేజ్ సినిమా “అంతరిక్షం 9000 కెఎంపిహెచ్” ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. తెలుగులో మొట్టమొదటి స్పేస్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాపైన మంచి అంచనాలే ఉన్నాయి. అయితే ఈ మధ్య నాగబాబు ఒక ఇంటర్వ్యూ లో బాలకృష్ణ పైన చేసిన వ్యాఖ్యల కారణంగా ఈ సినిమాకి కొన్ని సమస్యలు వచ్చేలా ఉన్నాయి. సినిమా రిలీజ్ అయిందో లేదో అప్పుడే కొందరు బాలయ్య అభిమానులు ఈ సినిమా పైన చెడు ప్రచారం మొదలు పెట్టారని సోషల్ మీడియాలో గోల మొదలయింది.

తమ ఫేవరెట్ హీరో బాలక్రిష్ణ పై తీవ్రమైన కామెంట్లతో విరుచుకుపడిన నాగబాబు కొడుకు సినిమా సరిగా ఆడకుండా కుట్ర చేశారన్న చర్చ సాగడం రచ్చకెక్కుతోంది.

దీంతో ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్లలోనూ ఆందోళన నెలకొందట. ఇప్పటికే ఇరు అభిమాన సంఘాల్లో బాహా బాహీ సాగుతోందని ఆ ప్రభావం అంతో ఇంతో సినిమాపైనా పడుతుందని భావిస్తున్నారట. అయితే ఈ సినిమాని ఈ క్రైసిస్ నుంచి కాపాడేందుకు మెగా అభిమానులు కొమ్ము కాసేందుకు ఏరియాల వారీగా చర్చించడంపైనా లీకులందుతున్నాయి.

బాలక్రిష్ణ కుడా రకరకాల సందర్భాల్లో తమ హీరోలపై కామెంట్లు చేయడంతో దానికి ప్రతి ఎటాక్ గానే నాగబాబు ఇంటర్వ్యూల్లో ఫైరయ్యారని అందుకు ప్రతిగా సినిమాని బలి పెట్టడం సరికాదని మెగా అభిమాన సంఘాలు ప్రచారం చేస్తున్నాయి. అయితే టాలీవుడ్లో ఈ తరహా కుట్రలు- కుతంత్రాలు కొత్తేం కాదు. అనాదిగా నడుస్తున్నవే. ఇప్పుడు వరుణ్ సినిమా వీటన్నటి నుంచి బయటపడి విజయం సాధించాలని కోరుకుందాం.

ఇక్కడ కొసమెరుపు ఏంటంటే అంతరిక్షం సినిమా నిర్మాతల్లో ఒకరైన క్రిష్, ఇప్పుడు బాలక్రిష్ణ తీస్తున్న ఎన్.టీ.ఆర్. బయోపిక్ కథానాయకుడికి దర్శకుడు అవ్వడం.

Tags : Varun Tej, Balakrishna, Nagababu, Antariksham

Write a comment ...
Post comment
Cancel