back

అల వైకుంఠపురముని సైతం వదలని బాలీవుడ్



Share via:

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ‘అల.. వైకుంఠపురములో’. తొలుత పాటలు సెన్సేషన్‌ సృష్టించగా.. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ సూపర్ హిట్ కలెక్ష​న్ల వర్షం కురిపిస్తోంది. టాలీవుడ్‌ స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, బుట్ట బొమ్మ పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నాన్‌బాహుబలి రికార్డులను తిరగరాస్తోంది.

అయితే ఈ చిత్రంపై బాలీవుడ్‌ కన్నుపడింది. ఈ సినిమా రీమేక్‌ రైట్స్‌ ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత ఏకంగా రూ.8 కోట్లకు కైవసం చేసుకున్నాడని సమాచారం.అంతేకాకుండా బాలీవుడ్‌ రీమేక్‌లో కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ నటిస్తాడని సమాచారం. దక్షిణాది చిత్రాలపై మక్కువ ఎక్కువ చూపే సల్మాన్‌కు ‘అల.. వైకుంఠపురములో’స్టోరీ బాగా నచ్చడంతో ఈ సినిమా రీమేక్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడట. అసలే వరుస పరాజయాలతో సతమతమవుతున్న సల్మాన్‌ ఈ రీమేక్‌ చిత్రం విజయం సాధించి పెడుతుందో వేచి చూడాలి. అయితే ఇక్కడే ఓ ట్విస్టు ఏర్పడింది. అయితే ఈ సినిమాను బాలీవుడ్‌లో నేరుగా తానే నిర్మిస్తానని అల్లు అరవింద్‌ భావిస్తున్నాడట. ఈ విషయంపై రాధాకృష్ణ, త్రివిక్రమ్‌లతో అల్లు అరవింద్‌ చర్చిస్తున్నట్లు టాలీవుడ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో బాలీవుడ్‌ రీమేక్‌ రైట్స్‌పై నెలకొన్న సందిగ్దత వీడాలంటే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Tags : Allu arjun, Ala Vaikuntapurramulo, Pooja Hegde, Remake, Trivikram

Write a comment ...
Post comment
Cancel