back

అజ్ఞాతవాసి ని అందుకోలేకపోయిన అరవింద సమేత ...



Share via:

నిన్న రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకున్న త్రివిక్రమ్-ఎన్టీఅర్ ల అరవింద సమేత వీర రాఘవ సినిమా మొదటి రోజే చాలా చోట్ల నాన్-బాహుబలి రికార్డ్స్ ని కూడా బ్రేక్ చేస్తుంది. అయితే ఒక్క విషయం లో మాత్రం ఈ సినిమా పవన్ కళ్యాణ్ లాస్ట్ సినిమా అజ్ఞాతవాసిని అందుకోలేకపొయింది. ఆ వివరాల్లోకి వెళితే.

.

రామ్ చరణ్ నటించిన `రంగస్థలం` 5కోట్ల (707 కె డాలర్ల)తో అమెరికా ప్రీమియర్ల రికార్డును నెలకొల్పిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ `అజ్ఞాతవాసి` నాన్ బాహుబలి ప్రీమియర్లలో అగ్ర స్థానంలో ఉంటే ఆ తర్వాత టాప్ 5లో రంగస్థలం నిలిచింది. ఇప్పుడు `రంగస్థలం` ప్రీమియర్ రికార్డును 791కే డాలర్లతో బ్రేక్ చేసిన `అరవింద సమేత` , పవన్ `అజ్ఞాతవాసి` 1.1 మిలియన్ డాలర్ వసూళ్ల  ప్రీమియర్ రికార్డును మాత్రం చేరలేకపాయింది. ఆ మేరకు అరవింద సమేత అమెరికా వసూళ్ల రిపోర్టును ప్రఖ్యాత బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ లో ప్రకటించారు. 

Tags : Aravindha Sametha, Agnyaathavaasi, Trivikram, NTR, Pawan Kalyan

Write a comment ...
Post comment
Cancel