back

అంతరిక్షం ఒక అద్బుతం - ట్రైలర్ టాక్



Share via:

నిన్న రిలీజ్ ఐన అంతరిక్షం ట్రైలర్ అందరితో అద్భుతం అనిపిస్తుంది.

షూటింగ్ జరిగినన్నాళ్లు సైలెంట్ గా ఉన్న వరుణ్ తేజ్ కొత్త సినిమా 'అంతరిక్షం 9000 కెఎంపిహెచ్' ట్రైలర్ నిన్న విడుదలైంది. వరుణ్ తేజ్ హీరోగా అదితి రావు హైదరి- లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఇండియాలోనే మొదటి ఒరిజినల్ స్పేస్ థ్రిల్లర్ గా చెప్పబడుతోంది.


ఇక ట్రైలర్ విషయానికి వస్తే కథను నిజాయితీగా చెప్పేసారు. ఇండియన్ స్పేస్ సెంటర్ చేస్తున్న ఓ శాటిలైట్ ప్రయోగం ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో ప్రపంచ కమ్యూనికేషన్ వ్యవస్థ తీవ్ర ప్రమాదంలో పడుతుంది. దీన్ని పరిష్కరించడంలో అంతకు ముందు అదే సెంటర్లో పనిచేసి ఏవో కారణాల వల్ల బయటికి వెళ్ళిపోయిన దేవ్ (వరుణ్ తేజ్)ని పిలిపిస్తారు. దేశ రక్షణ కోసం తన టీం తో అంతరిక్షంలోకి వెళ్ళిన వరుణ్ అనుకున్నది సాధించాడా ..లేదా అనేదే కథ.

దర్శకుడు సంకల్ప్ రెడ్డి ఘాజీ తరహాలోనే స్టోరీ పాయింట్ ధైర్యంగా ముందే రివీల్ చేసేసాడు. ట్రైలర్ లో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇలాంటి పూర్తి తరహా స్పేస్ మూవీ తెలుగులో ఇప్పటివరకు రాలేదు కాబట్టి ది బెస్ట్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడం కోసం సంకల్ప్ పడిన కష్టం ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది.


జ్ఞాన శేఖర్ కెమెరా వర్క్ అవుట్ స్టాండింగ్ అని చెప్పొచ్చు. ప్రశాంత్ విహారి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ఎలివేట్ అయ్యింది. రాజీవ్ రాజశేఖరన్ సిజి వర్క్ ప్రత్యేక ప్రశంశలు అందుకుంటుంది.

డిసెంబర్ 21న విడుదల తేదీని కన్ఫర్మ్ చేసిన అనంతరం, అంతరిక్షం సినిమా మొత్తానికి అంచనాలను అమాంతం పెంచడంలో సక్సెస్ అయ్యింది.


ట్రైలర్ పైన సుకుమార్ వ్యాఖ్యలు...
''ఇది అద్భుతం.. అది అద్భుతం అంటూ ప్రతి సినిమాని పొగిడేస్తాం కానీ అద్భుతం అంటే ఇదీ'' అంటూ స్పెల్ బౌండ్ అయిపోయి పొగడ్తల వర్షం కురిపించాడు.

Tags : Antariksham Trailer Review, Varun Tej, Aditi Rao Hydari, Lavanya Tripathi, Sankalp Reddy

Write a comment ...
Post comment
Cancel