back

అదిరిపోయిన అంతరిక్షం ప్రీ రిలీజ్ బిజినెస్



Share via:

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న తొలి తెలుగు వ్యోమగామి చిత్రం "అంతరిక్షం 9000 కే.ఎం.పి.హెచ్". ఈ చిత్రం ఈ నెల 21వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. సంకల్ప్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో లావణ్య త్రిపాటి, అదితి రావు హైదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. క్రిష్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

ఈ చిత్రం విడుదలకు ముందే మంచి బిజినెస్ చేసింది. ఈ చిత్ర యొక్క ప్రపంచ వ్యాప్త ధియేట్రికల్ హక్కులు 21కోట్లకు అమ్ముడు పోయినట్టు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో 16 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన అంతరిక్షం ప్రపంచ వ్యాప్తంగా 21 కోట్లను రాబట్టింది.


ఇందులో నిజాం 6 కోట్లు, సీడెడ్ 2.5 కోట్లు, వైజాగ్ 2 కోట్లు, ఈస్ట్, వెస్ట్, కృష్ణ, గుంటూరు, నెల్లూరు కలిపి 16 కోట్లకు పైగా బిజినెస్ చేసింది తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో. మొత్తంగా కలిపి 21కోట్లని అంచనా.

నిన్న జరిగిన అంతరిక్షం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.


Tags : Antariksham 9000 KMPH, Varun Tej, Antariksham Pre Release Business

Write a comment ...
Post comment
Cancel