back

అంతరిక్షం ట్రైలర్ ఎప్పుడంటే ..!



Share via:

దర్శకుడు క్రిష్ మరియు కంచే ఫేం రాజీవ్ రెడ్డి సంయుక్త నిర్మాణంలో... 'ఘాజి' తో అవార్డ్స్ అందుకున్న సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ముఖ్య పాత్రలో తెలుగులో వస్తున్న మొట్టమొదటి అంతరిక్షంకి సంబంధించిన సినిమానే “అంతరిక్షం 90000 కెఎంపిహెచ్”. ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసిన సమయంలో డిసెంబర్ 21 రిలీజ్ అని అనౌన్సు చేసిన సినిమా నిర్మాత తర్వాత సినిమాకి సంబంధించి ఎటువంటి విషయం కూడా వెల్లడించలేదు! తీరా చూస్తే రిలీజ్ కు పదిహేను రోజుల సమయం కూడా లేదు. ప్రమోషన్ హడావిడి ఏమి కనిపించడం లేదు.
మరి సినిమా రిలీజ్ 21కి ఉందా లేదా అనుకుంటున్నా సమయంలో సినిమా యూనిట్ మొన్న ఒక పాటని రిలీజ్ చేయటం, అలాగే ఈ రోజు ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్సు చేయటంతో అనుమానాలు పటాపంచలు అయ్యాయి. ఈ చిత్ర ట్రైలర్ ఈ నెల 9న ఉదయం 11 గంటలకు విడుదలకానుంది. ఇప్పటికే టీజర్ అండ్ డ్యూయెట్ సాంగ్ కి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా ఇక ఈ ట్రైలర్ రిలీజ్ అయ్యాక సినిమాకి కావాల్సిన హైప్ ని క్రియేట్ చేస్తున్ధననడంలో సందేహం లేదు.


varun tej antariksham movie teaser release date
ఈ చిత్ర ట్రైలర్ ని మహేష్ బాబు, ఏషియన్ సినేమాస్ సంయుక్తంగా నిర్మించిన AMB సినిమాస్ లో విడుదల చేయ్యనున్నట్టు సమాచారం

Tags : Varun Tej, Antariksham 9000 KMPH Trailer

Write a comment ...
Post comment
Cancel