back

జనసేనలోకి మాజీ మంత్రి.. ప్రస్తుత ఎం.ఎల్.ఏ



Share via:

పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి జనం మధ్యలోకి వచ్చి అప్పుడే 5 ఏళ్ళు అవుతుంది. అయితే జనసేన పార్టీ లో పెద్దగా చెప్పుకునే పేర్లు ఏవి లేకుండానే ఇన్నాళ్ళు పవన్ వన్ మాన్ షో అనేలా పార్టీని నడుపుతూ వచ్చారు. అయితే ఎప్పుడైతే మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ పవన్ కి జత కలిసాడో అప్పటినుంచి జనసేనలోకి వలసలు క్రమంగా పెరుగుతున్నాయి. గత రెండు నెలల్లో ఇద్దరు మాజీ మంత్రులు బాలరాజు మరియు కిశోర్ బాబు చేరగా , ఇప్పుడు ఇంకో మాజీ మంత్రి మరియు ప్రస్తుత ఎం.ఎల్.ఏ లు జనసేనలోకి వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అందులో ఒకరు సీనియ‌ర్ నేత మాజీ మంత్రి దాడి వీర‌భ‌ద్రారావు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీ నుండి వైసీపీలోకి జంప్ అయిన వీరభద్రరావు 2014 ఎన్నిక‌ల్లో విశాఖ‌ప‌ట్నం అభ్య‌ర్ధిగా వైసీపీ నుండి బ‌రిలోకి దిగి ఓట‌మి పాల‌య్యారు. ఇక ఆ త‌ర్వాత వైసీపీ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన వీర‌భ‌ద్రారావు, అప్ప‌టి నుండి యాక్టీవ్ పాలిటిక్స్‌కు దూరంగా ఉండగా , రాష్ట్రంలో ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డ‌డంతో మ‌రో‌సారి రాజ‌కీయాల్లో యాక్టీవ్ అవ‌నున్నార‌ని తెలుస్తోంది. ఇప్పటికే ఈయన జనసేనలో చేరడం గురించి నిర్ణయం తీసేసుకున్నారని తెలుస్తుంది.


ఇంకొకరు రాజ‌మండ్రి సిటీ ఎమ్మెల్యే ఆకుల స‌త్య‌నారాయ‌ణ , గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ- బీజేపీ కూట‌మిలో భాగంగా బీజేపీ నుండి పోటీ చేసిన ఆకుల స‌త్య నారాయ‌ణ‌, విజ‌యం సాధించారు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీకి డిపాజిట్లు కూడా వ‌చ్చే అవ‌కాశం లేక‌పోడం, ఆయ‌న‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏదో ఒక బ‌ల‌మైన పార్టీలో ఉంటే కానీ ప్ర‌యోజ‌న ఉండ‌ద‌ని భావిస్తున్నారు. దీంతో ఇప్ప‌టికే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో చ‌ర్చలు కూడా జ‌రిపార‌ని, ఆయ‌న‌కు రాజమండ్రి ఎం.పి. టిక్కెట్ విష‌యం పై కూడా క్లారిటీ ఇచ్చార‌ని, దీంతో త్వ‌ర‌లోనే ఆకుల స‌త్య‌నారాయ‌ణ జ‌న‌సేన‌లో చేర‌డం ఖాయ‌మ‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.

ఇలాగే కొనసాగితే ఎన్నికల టైం కి జనసేన లో కోలాహలం తారాస్థాయిలో ఉండడం ఖాయం.


Tags : Janasena Party, Pawan Kalyan, Aakula Satyanarayana, Veerabhadra Rao

Write a comment ...
Post comment
Cancel