back

రాంచరణ్ - బోయపాటి సినిమాకి మరో రెండు పేర్లు...



Share via:

డి.వి.వి. దానయ్య నిర్మాణంలో మెగా పవర్ స్టార్ రాంచరణ్తో బోయపాటి శ్రీను తీస్తున్న సినిమా షూటింగ్ అజర్బైజాన్ షెడ్యూల్ పూర్తి చేసుకుని నెక్స్ట్ షెడ్యూల్ ప్లానింగ్ లో ఉంది. ఇప్పటి వరకు తెలుగు సినిమాలో చూపించని అజర్ బైజాన్ లోని అందమైన ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరిగింది.

ఇప్పటికే సంక్రాంతి కి సినిమా విడుదల అంటూ ప్రకటించిన నిర్మాత. ఇప్పటివరకు పేరు పెట్టని ఈ సినిమా టైటిల్ ని ఫస్ట్ లుక్ తో పాటు అక్టోబర్ 18న దసరా పండుగ సందర్బంగా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా కోసం నిర్మాత దానయ్య రెండు పేర్లని రిజిస్టర్ చేయించారు,

ఈసారి ఓ మాస్ టైటిల్, మరో క్లాస్ టైటిల్ బయటకొచ్చాయి. ముందుగా మాస్ టైటిల్ విషయానికొస్తే 'రౌడీ తమ్ముడు' అనే పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. స్టేట్ రౌడీ అనే టైటిల్ లో రౌడీకి, పవన్ కల్యాణ్ నటించిన తమ్ముడు టైటిల్ లింక్ చేసి పెట్టారన్నమాట. సినిమాలో చరణ్ ది ఇద్దరు అన్నలకు తమ్ముడి పాత్ర. అందుకే ఇలా పెట్టారేమో. ఇక క్లాస్ టైటిల్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ టైటిల్ పేరు 'వినయ విధేయ రామ'. బెల్లంకొండ సినిమాకు జయజానకి నాయక అనే పేరుపెట్టినట్టు, చరణ్ సినిమాకు ఇలా క్లాసీగా వినయ విధేయ రామ అనే పేరు ఫిక్స్ చేశాడట బోయపాటి. 

మరి ఈ రెండిట్లో ఏది ఫైనల్ అవుతుంది అనేది ఇంకో పది రోజులు ఆగితే కాని తెలీదు.

Tags : Mega Power Star, Ram Charan, RC12, Rowdy Thammudu, Vinaya Videya Rama

Write a comment ...
Post comment
Cancel