back

వరుణ్ తేజ్ తో రంగమ్మత్త..!



Share via:

దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న సినిమా ‘F2’. ఈ సినిమా ఈ సంక్రాంతికి రిలీజ్ చేస్తామని నిర్మాత దిల్ రాజు మరోసారి గట్టిగా చెప్పేశారు. ఈ సినిమాలో తమన్నా మరియు మేహ్రీన్ లు హీరోలకు జోడి గా నటిస్తున్నారు.

ఇక రంగస్థలంలో రంగామ్మత్తగా నటించి అందరి మన్ననలు పొందిన అనసూయ ఈ సినిమాలో కూడా ఉంది అనే సమాచారం అందింది. ఈ సినిమాలో ఒక ఐటెం సాంగ్ కోసం అనసూయను సంప్రదిస్తే వెంటనే ఓకే చెప్పిందట.

ఇలా ఐటెం సాంగ్ చేయడం అనసూయకు కొత్త  కాదు ఇంతకుమునుపే సాయి ధరం తేజ్ ‘విన్నర్’ సినిమాలో ‘సూయ సూయ అనసూయ’ అంటూ నర్తిచింది. అప్పటినుండి తనకు ఈ స్పెషల్ సాంగ్ ఆఫర్లు వస్తున్నా ఎందుకో వాటిని స్వీకరించలేదట. కానీ ఇప్పుడు మాత్రం 'ఎఫ్2' ఆఫర్ కు వెంటనే యస్ చెప్పిందట.

మళ్ళి మరోసారి అనసూయతో వరుణ్ తేజ్ మరియు వెంకటేష్ చేయబోతున్న ఈ పాట సినిమా హాల్ల్లో మాస్ ని ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Tags : Varun Tej, Anasuya, F2 Fun and Frustration, Venkatesh

Write a comment ...
Post comment
Cancel