back

అల్లు శిరీష్ ఎక్కడా ..?



Share via:

అల్లు అరవింద్ చిన్నబ్బాయి , అల్లు అర్జున్ కి తమ్ముడు , తెలుగు సినిమా హీరో అల్లు శిరీష్ ఇప్పుడు ఎక్కడున్నాడు? ఎం చేస్తున్నాడు? ..అనే ప్రశ్నలకు సమాధానం...

మంచి సినిమాలు చేసిన కూడా ఘన విజయం సాధించలేకపోతున్న అల్లు శిరీష్, ప్రస్తుతం ఏబిసిడి (అమెరికా బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశి ) లో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ లో భాగంగా ప్రస్తుతం ఓ ఫోక్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. శేఖర్ మాస్టర్ నేతృత్వంలో శిరీష్ ఈ పాటకు స్టెప్పులు వేస్తున్నాడు. ఈపాట తో సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తియైనట్లే. మలయాళ సూపర్ హిట్ మూవీ ఏబిసిడి కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జూదా శాండీ సంగీతం అందిస్తున్నారు.


నూతన దర్శకుడు సంజీవ్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రుక్సార్ మీర్ హీరోయిన్ గా నటిస్తుండగా ప్రముఖ నిర్మాత డి సురేష్ బాబు ఈ చిత్రానికి సమర్పణలో బిగ్ బెన్ సినిమాస్ అధినేత యష్ రంగినేని మరియు మధుర శ్రీధర్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈచిత్రం మార్చి 1న విడుదలకానుంది. మరి ఈ సినిమాతోనైనా అల్లు శిరీష్ ఆశ నెరవేరాలని కోరుకుందాం.

Tags : Allu Sirish, ABCD Film

Write a comment ...
Post comment
Cancel