back

మలయాళం రీమేక్ లో అల్లు శిరీష్



Share via:

అల్లు అరవింద్ కొడుకు అల్లు అర్జున్ కి తమ్ముడు అయినప్పటికీ, ఒక మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు అల్లు శిరీష్. మంచి సినిమాలే తీసిన కూడా ఎక్కడో లోపంతో దెబ్బ పడుతున్నది. చూసిన వాళ్ళంతా బాగుంది అనిన ఒక్క క్షణం కూడా సరైన పలితం రాకపోవడంతో డీలా పడిన శిరీష్ 4 నెలల విరామం తరువాత ఒన రీమేక్ సినిమా షూటింగ్ కి రెడీ అవుతున్నాడు.

మలయాళంలో దుల్కర్ సల్మాన్ కి మంచి హిట్ ఇచ్చిన సినిమా ABCD (అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్డ్ దేసి). ఒక రిచ్ ఎన్నారై యువకుడు ఇండియాకి వచ్చి నార్మల్ లైఫ్ ని కొనసాగించాలి. అప్పుడు అతను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు అనేది అసలు పాయింట్. ఈ కథలో భావోద్వేగాలతో కూడిన సన్నివేశాలతో పాటు మంచి కామెడీ ఉంటుంది. అల్లు శిరీష్ ఎంత వరకు ఆకట్టుకుంటాడో చూడాలి. కొత్త దర్శకుడు సంజీవ్ ఈ రీమేక్ కథను తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. జూన్ లో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టి వీలైనంత త్వరగా ఇదే ఇయర్ లో సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు.

Tags : Allu Sirish Next Movie, Allu Sirish in Malayalam Movie Remake, ABCD Malayalam Movie

Write a comment ...
Post comment
Cancel