back

తన అభిమానికి గిఫ్ట్ ఇచ్చిన అల్లు శిరీష్



Share via:

అల్లు శిరీష్ గురించి తెలిస్తే మీరు తన మంచితనాన్ని మెచ్చుకోకుండా ఉండలేరు. ఈ రోజు జరిగిన ఒక చిన్న సంఘటనతో తన అద్బుత దాతృత్వ హృదయాన్ని చాటుకున్నాడు మన అల్లు వారి అబ్బాయి.

ఇక విషయానికి వస్తే...

అల్లు శిరీష్ కి తన అన్న అల్లు అర్జున్ గిఫ్ట్ గా ఇచ్చిన లాప్టాప్ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ బన్నీకి థాంక్స్ చెప్పాడు శిరీష్.

అయితే అది చుసిన అల్లు వారి అభిమాని మురళీధర్..
"తనకి లాప్టాప్ చాలా అవసరం అని... కానీ తనకి వేతనం తక్కువగా ఉండడం వలన అది కొనడం సాధ్యపడటం లేదని, పైగా తనకి ఒక కుటుంబం ఉందని, మీరు కూడా నాకు ఒక లాప్టాప్ గిఫ్ట్ గా ఇచ్చి తనకి, తన కుటుంబానికి సహాయపడాలని అడిగాడు."

అది చుసిన శిరీష్ ఇలా చెప్పుకొచ్చాడు...
అయ్యో... మీరేం బాదపదకండి. మీరు మీ ఫ్యామిలిని బాగా చూసుకోండి. నా దగ్గర ఇప్పుడు ఎలాగు కొత్త లాప్టాప్ ఉంది కాబట్టి నేను ఇప్పటివరకు వాడిన సోనీ వైఒ లాప్టాప్ ని మీకు ఇస్తాను. మీరు మీ చిరునామాని పంపించండి అని చెప్పాడు.

ఇది చూస్తే మీకు కూడా అర్ధమయ్యి ఉంటుంది. మన అల్లు శిరీష్ ఎంత మంచి మనసు కలవాడో.

Tags : Allu Sirish

Write a comment ...
Post comment
Cancel