back

సాయంత్రం అల్లు అరవింద్ ప్రెస్ మీట్ - వర్మ నే ఎజెండా ..



Share via:

తానో ప్రత్యేకమైన వ్యక్తి అని నిరూపించుకుంటూ, ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీ చేసుకుంటూ మీడియా లో కనిపిస్తూ ఉండే రాంగోపాల్ వర్మ... శ్రిరెడ్డి వ్యవహారంలో దూరి పవన్ కళ్యాణ్ ని చెప్పలేని విధంగా దూశించాలని సూచించి ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యేసరికి పవన్ కళ్యాణ్ కి.. పవన్ తల్లికి.. హర్ట్ అయిన వారికి సారీ చెప్పాడు.

మెగా యుద్ధానికి సిద్ధం కండి - బన్నీ వాసు

ఈ మొత్తం అంశంపై ఇప్పుడు అల్లు అరవింద్ ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ పైన ఎటువంటి చర్య తీసుకోవాలి అనే అంశం పైనే ఈ ప్రెస్ మీట్ ఉండనున్నట్లు తెలుస్తోంది. చాలాకాలంగా పవన్ పైనా.. మెగా ఫ్యామిలీ పైనా దారుణమైన విమర్శలు చేస్తున్నాడు వర్మ. ఇప్పుడు శ్రీరెడ్డితో తనే అంత పెద్ద బూతు తిట్టించానని ఒప్పుకున్నాడు కానీ.. అందుకు చెప్పిన రీజన్ ఎవరినీ కన్విన్స్ చేయలేకపోయింది. అలాగే ఈ టాపిక్ లోకి పవన్ ను లాగడం వెనక కుట్ర గురించి కూడా ఈ ప్రెస్ మీట్ లో గుట్టు విప్పబోతున్నట్లు తెలుస్తోంది.

Tags : Allu Arvind, Sri Reddy, Pawan Kalyan, Tollywood, Telugu Film Industry

Write a comment ...
Post comment
Cancel