back

నిన్నప్రారంభం అయిన అల్లు అర్జున్ వాటర్ ప్లాంట్ ..



Share via:

గత సంవత్సరం తితిలి తుఫాను కారణంగా దెబ్బతిన్న శ్రీకాకుళం ప్ర్రాంతం ని సందర్శించిన జనసేనాదిపతి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అక్కడి వారి పరిస్థితి చూసి చలించిపోయి, తన కుటుంబ హీరోలను ఆ భాదితులను ఆదుకోమని చేసిన విజ్ఞప్తిని మన్నించి రాంచరణ్ ఒక గ్రామమను దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చాడు. అదే సమయం లో కొన్ని ఊర్లలోఉచిత వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఇప్పుడు ఆ వాటర్ ప్లాంట్లలో ఒక ప్లాంట్ నిన్న ప్రారంభించారు.


ఫిబ్రవరి 14న అంటే నిన్న అల్లు అర్జున్ అభిమానులు మరియు జనసేన కార్యకర్తలు కలిసి ఆ మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంబించారు. అల్లు అర్జున్ ముందుకు వచ్చి తమ గ్రామంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయించినందుకు అమలపాడు గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అల్లు అర్జున్ ఆమద్య కేరళ వరద బాధితులకు కూడా సాయంగా నిలిచేందుకు ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. అల్లు అర్జున్ ఇలాంటి కార్యక్రమాలతో రియల్ హీరో అనిపించుకుంటున్నాడు.

Tags : Allu Arjun, Titli cyclone, Pawan Kalyan

Write a comment ...
Post comment
Cancel