back

ఫ్యామిలీ మాన్ గా మారిపోయిన బన్నీ



Share via:

నా పేరు సూర్య సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్, ఈ టైం ని అంతా తన ఫ్యామిలీ కోసమే కేటాయించాడు. భార్యా పిల్లలతో పాటు తల్లితండ్రులు,అన్నదమ్ములతో ఎంజాయ్ చేస్తున్నాడు.

ఉదయం పూట సంప్రదాయ పూజలు... సాయంత్రం తర్వాత సరికొత్త సంగీత ధ్వనులు... అల్లు అర్జున్‌ రెండిటినీ ఆస్వాదించారు. శనివారం అట్లతద్ది. అల్లు వారింట శోభాయమానంగా పండుగ జరిగింది. అల్లు అర్జున్‌ అర్థాంగి స్నేహారెడ్డి పూజలు చేశారు. ఈ సందర్భంగా శ్రీవారితో దిగిన ఫొటోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారామె. అలాగే, శనివారం రాత్రి అన్నదమ్ములు అల్లు వెంకట్‌ (బాబీ), శిరీష్‌తో కలిసి హైదరాబాద్‌, గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ‘సెన్సేషన్‌ రైజ్‌’ పార్టీకి వెళ్ళారు.  సరదాగా గడుపుతున్న పిక్ ని శిరీష్ తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేసుకున్నాడు. హైదరాబాద్ సెన్సేషన్ రైజ్ లో ముగ్గురు అన్నదమ్ములు మాంచి సమయం గడిపినట్టు ఉన్నారు. గాగుల్స్ తో విభిన్నమైన పబ్ లైటింగ్ లో వెరైటీ గా అనిపిస్తున్న ఈ లుక్ ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ లా ఉంది. బన్నీ అన్నయ్యను చాలా రోజుల తర్వాత చూస్తున్న అభిమానులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Tags : Allu Arjun, Allu Sneha Reddy

Write a comment ...
Post comment
Cancel