back

అల్లు అర్జున్ - త్రివిక్రమ్ చిత్రం అన్నౌన్ మెంట్ ఎప్పుడంటే...



Share via:

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తదుపరి చిత్రం గురించి సినీ వర్గాల్లో చర్చ మొదలైంది. మొన్న ఒకసారి అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమా గురించి తొందర్లోనే వెల్లడిస్తానని చెప్పిన విషయం తెలిసిందే.

అయితే ఇప్పుడు సినీ వర్గాల నుంచి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయిటికి వస్తున్నాయి.


బన్నీ తదుపరి చిత్రం గురించి చాల కాలంగా వేచి చూస్తున్న అభిమానులకి అద్బుతమైన వార్తా - అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చెయ్యడం దాదాపుగా ఖరారు అయ్యిందని. ఇక ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన జనవరిలో రానుందని సమాచారం.

ప్రకటన వచ్చిన వెంటనే... ఈ చిత్రాన్ని అధికారికంగా లాంచ్ చేసి షూటింగ్ మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉన్నారంట త్రివిక్రమ్ మరియు బన్నీ.


మరి ఇంతటి ఉత్సాహమైన వార్తని వినాలంటే మాత్రం జనవరి వరకు వేచి చూడాల్సిందే బన్నీ అభిమానులు...!

Tags : Allu Arjun, Trivikram Srinivas

Write a comment ...
Post comment
Cancel