back

తిత్లి భాదితులకు అండగా బన్నీ ఏమ్చేసాడంటే..!Share via:

ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు మన టాలీవుడ్ సెలబ్రిటీలు మందుకు వచ్చి తమకు చేతనైన సహాయం చేస్తూ ఉంటారు. ఈ ఏడాది అక్టోబర్ రెండో వారంలో తిత్లీ తుఫాను కారణంగా శ్రీకాకుళం జిల్లా తీవ్రంగా నష్టపోయిన సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళం ప్రకటించడానికి బదులుగా నేరుగా సహాయం చేస్తానని బన్నీ ప్రకటించాడు.


ఆ మాట మేరకు శ్రీకాకుళం జిల్లాలోని మూడు గ్రామాలకు ఆర్.ఓ వాటర్ ఫిల్టర్ ప్లాంట్లు సమకూర్చాడు. మరో గ్రామానికి బోర్ వెల్ సమకూర్చాడు. కొండలోగాం, దేవునాల్తడ, అమలపాడు, పోలాకి వంటి తీరగ్రామాలకు బన్నీ టీం వెళ్లి ఈ సహాయాలు ఏర్పాటు చేసింది. వీటి వల్ల దాదాపు ఎనిమిది నుంచి పదివేల మందికి నిత్యం మంచి తాగునీరు అందుతుంది. అసలే శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాల్లో కిడ్నీ వ్యాధులతో జనం బాధపడుతున్నారు. అలాంటి చోట్ల ఇలా ఆర్వో ఫిల్టర్ ఫ్లాంట్లు ఏర్పాటు చేయడం వల్ల ఆ ప్రాంత జనాలకు కాస్త ఆరోగ్యం కుదుటపడే అవకాశం ఉంటుంది .

ఎటువంటి విపత్తు సంబవించినా సహాయం చేయడంలో ముందుండే మెగా హీరోలు ఇలా నేరుగా సహాయం చేయడం అబినందనీయం. ఇప్పటికే రాంచరణ్ ఒక గ్రామాన్ని దత్తత తీసుకుంటానని ప్రకటించాడు.

Tags : Allu Arjun Donations, Titli Cyclone

Write a comment ...
Post comment
Cancel