back

సాయి ధరం తేజ్ కోసం బన్నీ త్యాగం చేసాడా..!



Share via:

వరుస ఫ్లాపులతో సాయిధరమ్ తేజ్ కెరీర్ ప్రస్తుతం ఏమంత బాగోలేదు. ఫ్లాపుల్లో డబుల్ హ్యాట్రిక్ కొట్టేశాడు. ఇకమీదట హిట్ కొట్టకపోతే మనోడ్ని మర్చిపోయే పరిస్థితి కూడా ఏర్పడింది. ఇప్పుడు తను ఎంతో ఆలోచించి చిరంజీవికి కథ వినిపించి మరి చేస్తున్న సినిమా ‘చిత్రలహరి’. అది కాని తేడా కొడితే ఇక తేజు కెరీర్ చివరికి వచ్చినట్లే.

ఇలాంటి టైమ్ లో సీన్లోకి మామయ్య మెగాస్టార్ చిరంజీవి ఎంటర్ అయ్యారు. అల్లు అరవింద్ సాయితో గీత ఆర్ట్స్ లో మంచి సినిమా తీయమని ఆర్డర్ వేశారు. ఇప్పటికిప్పుడు అరవింద్ కి కనిపించిన మినిమం గ్యారంటి డైరెక్టర్ పరుశురామ్.


గీత గోవిందం లాంటి భారీ హిట్ తరువాత పరుశురామ్ బన్నీని దృష్టిలో పెట్టుకుని కథ సిద్ధం చేసుకుంటున్నాడు. బన్నీ కూడా పరుశురామ్ తో సినిమా చేసేందుకు సిద్ధమైపోయాడు. కథ కూడా దాదాపుగా పూర్తైంది.

ఇప్పుడు అదే కథని తేజు తో చేయమని అరవింద్ పరుశురాం ని అడిగాడంట, అయితే ఇదే టైములో పరిస్థితి అర్థం చేసుకున్న అల్లు అర్జున్ కూడా డైరెక్టర్ కి అదే మాట చెప్పి తేజు కోసం సినిమాని త్యాగం చేసాడు అంటున్నారు "గీతా జనాలు". ఎలాగు అంతా ఒక ఫ్యామిలీనే కనుక ఇవన్ని మామూలే, ఎలాగు బన్నీ త్రివిక్రమ్ సినిమాకి రెడీ అవుతున్నాడు కదా!


Tags : Allu Arjun, Sai Dharam Tej

Write a comment ...
Post comment
Cancel