back

సైరా బడ్జెట్ చెప్పేసిన అల్లు అర్జున్ ?



Share via:

నిన్నటి రోజు ఉదయం సైరా సినిమా టీజర్ విడుదల సందర్బంగా నిర్మాత రాంచరణ్ ని కొందరు విలేకరులు సినిమా బడ్జెట్ గురించి అడగగా - చరణ్ సమాధానం చెప్పకుండా తన తండ్రి కోసం ఎంతైనా కర్చు పెడతాను అంటూ చెప్పుకొచ్చారు. కాని ఆ ప్రశ్నకు సాయంకాలం జరిగిన చిరంజీవి జన్మదిన వేడుకలలో అల్లు అర్జున్ సమాధానం చెప్పకనే చెప్పేసాడు. అసలు బన్నీ ఏమన్నాడంటే ...

"మెగాస్టార్ ఓ బిగ్ స్కేల్ ఎపిక్ మూవీ చేయాలనే నా కల మాత్రం నెరవేరలేదు. ఎట్టకేలకు అలాంటి సినిమాను రామ్ చరణ్ నిర్మాతగా తీస్తున్నాడు. అదే సైరా నరసింహారెడ్డి. కొడుకు తండ్రికి ఇస్తున్న గిఫ్ట్ ఇది. చిరంజీవి గారి ఎంటైర్ లైఫ్ లో బిగ్గెస్ట్ ఫిలిం ఇది. దాదాపు ఖైదీ నంబర్ 150 సినిమా ఎంత కలెక్ట్ చేసిందో దానికి 2 రెట్లు బడ్జెట్ తో సైరా సినిమా వస్తోంది.".

కానీ ఇక్కడే ఒక చిన్న క్లారిటీ మిస్ అయింది.. అదేంటంటే ఖైదీ 150 ఫుల్ రన్ లో 102 కోట్ల షేర్ 150 కోట్ల పైన గ్రాస్ వసూలు చేసింది. మరి బన్నీ చెప్పిన దాన్ని బట్టి ఈ సినిమా బడ్జెట్ 200 నుంచి 300 కోట్ల మధ్యన ఉంటుంది. అంటే సుమారు బాహుబలి బడ్జెట్, కాని ఈ సినిమా టీజర్ చూస్తుంటే ఆ బడ్జెట్ ని ఈజీ గానే వసూలు చేసేలా ఉంది.

Tags : Allu Arjun About Sye Raa Narasimha Reddy Budget, Megastar Chiranjeevi, Ram Charan

Write a comment ...
Post comment
Cancel