back

పవన్ కళ్యాణ్ కి మద్దతుగా అల్లు అర్జున్



Share via:

అప్పుడెప్పుడో చెప్పను బ్రదర్ అంటూ పవన్ ఫ్యాన్స్ కు అల్లు అర్జున్ చెప్పిన ఒక్క మాట కారణంగా.. మెగా ఫ్యాన్స్ మధ్య కొన్ని అంతరాలు వచ్చాయి. అయితే.. తాజాగా పవన్ కళ్యాణ్ ని ఆయన తల్లిని ఉద్దేశిస్తూ శ్రీరెడ్డి తిట్టడం.. దీని వెనుక రాంగోపాల్ వర్మ ఉన్నాడనే విషయం బయటపడడం.. అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టి మరీ వర్మను చీల్చి చెండాడడం వంటివి కనిపించాయి. ఆ తర్వాత ఈ మొత్తం ఇష్యూపై పవన్ కళ్యాణ్ స్పందించాడు. ఎక్కడా మాట్లాడకపోయినా.. ట్విట్టర్ లో కొన్ని పోస్టులను చేయడం ద్వారా తన ఉద్దేశ్యాలను చెప్పుకొచ్చాడు పవన్. కన్నతల్లి గౌరవాన్ని కాపాడలేకపోతే.. తాను బతికి ఉండడమే అనవసరం అన్నాడు పవన్.

తాజాగా ప‌వ‌న్ చేసిన ఈ ట్వీట్ల‌ను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త‌న ట్విట‌ర్ ఖాతాలో పొందుప‌రిచాడు. ప‌వ‌న్ చేసిన ట్వీట్ల‌కు వ‌రుస సంఖ్య‌లు ఇస్తూ వాటిని రీట్వీట్ చేసి ప‌వ‌న్‌కు మ‌ద్ద‌తుగా నిలిచాడు.

Tags : Allu Arjun, Pawan Kalyan

Write a comment ...
Post comment
Cancel