back

అల్లు అర్జున్ 96 రీమేక్ చేయట్లేదు ..



Share via:

తమిళ్ లో త్రిష - విజయ్ సేతుపతి జంటగా వచ్చిన ఒక విభిన్నమైన సినిమా ‘96’. ఈ సినిమా అక్కడ ఘన విజయం సాధించింది, అది కూడా ఎలాగంటే ఒక వైపు టివి లో సినిమా వస్తుంటే ఇంకో వైపు థియేటర్లు హౌస్ ఫుల్ అవ్వడం. ఇటువంటి సినిమాని ఎలాగైనా తెలుగులో రీమేక్ చేయాలని భారీగా పోటి ఉన్నా కూడా పెద్ద రేట్ కి దిల్ రాజు తీసుకున్నారు.

ఈ సినిమాలో లీడ్ రోల్ లో అల్లు అర్జున్ ను నటింప చెయ్యాలని మొదట విడత చర్చలు జరిగాయి, స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు కూడా బన్నీ సూచించాడని చర్చ జరిగింది, కాని ఏమైందో తెలిదు ఈ సినిమాని బన్నీ రిజెక్ట్ చేసాడంట. అందుకే దిల్ రాజు వేరే హీరోలతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇక ప్రస్తుతానికి త్రివిక్రమ్ తో సినిమా కోసం జరుగుతున్న చర్చలు తప్పితే బన్నీ ఇక వేరే ఏ ఆప్షన్ కూడా పెట్టుకోలేదు.

Tags : Allu Arjun, 96 Movie Remake

Write a comment ...
Post comment
Cancel