back

పవన్ కళ్యాణ్ ని అన్నారు .... నాకు నచ్చలేదు - అల్లు అర్జున్Share via:

నిన్న జరిగిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ఆడియో ఈవెంట్ లో అల్లు అర్జున్ తనకి పవన్ కళ్యాణ్ పైన ఉన్న ప్రేమని తెలియచేసాడు. ఇంతకు ముందు చెప్పను బ్రదర్ అనే ఒక్క మాటతో పవన్ అభిమానులకు దూరం అయిన బన్నీ మొన్న పవన్ కి భాసటగా ఫిలిం ఛాంబర్ కి వెళ్లి అయ్యానని కౌగలించుకోవడం ... మళ్ళి నిన్న తన సినిమా ఫంక్షన్ లో మాట్లాడుతూ మీడియా చేసిన అతి గురించి చెప్పడం, అన్ని కుడా బన్నీ కి పవన్ పైన ఉన్న గౌరువాన్ని తెలియచేయడమే కాక మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటే అనే సందేశాన్ని అభిమానులకి చెప్పకనే చెప్పాడు.

బన్నీ మాటల్లో...
"టీవీల్లో చూస్తూనే ఉన్నాం. పవన్ పై ఎవడెవడో ఏదేదో మాట్లాడుతున్నాడు. అంతా మన ఖర్మ. కానీ మొన్న చాలా పర్సనల్ గా మాట్లాడారు. నాకు నచ్చలేదు. మాట్లాడిన వాళ్లది తప్పు. మాట్లాడించిన వాళ్లది తప్పు. ఇలా మాట్లాడిన వాళ్లను లక్షల మంది జనాలకు చూపించిన వాళ్లది అందరి కంటే పెద్ద తప్పు. వెలిగింది అగ్గిపుల్లే కావొచ్చు, కానీ పెట్రోల్ ట్యాంకర్ ది తప్పు. ఇది నాకు అస్సలు నచ్చలేదు."

ఇలా శ్రీరెడ్డిని అగ్గిపుల్లతో, మీడియాను పెట్రోల్ టాంకర్ తో పోల్చాడు అల్లు అర్జున్. ఎవరెన్ని చెప్పినా పవన్ మాత్రం తను చేయాల్సింది చేస్తాడని అన్నాడు బన్నీ.

Tags : Allu Arjun, Pawan Kalyan, NSNI Audio Launch, Naa Peru Surya Naa Illu India Audio Launch, Nagababu

Write a comment ...
Post comment
Cancel