back

అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా…?



Share via:

నా పేరు సూర్య సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఇప్పుడు తన తర్వాత సినిమా పైన కసరత్తు చేస్తున్నాడు. త్రివిక్రమ్ తో కథా చర్చలు జరుగుతున్నాయి. ఈ మధ్య బన్నీ కేరళలో పర్యటించినపుడు అక్కడి మీడియాకి త్వరలో తమిళ్ కం మలయాళంలో ఒక డైరెక్ట్ సినిమా చేయబోతున్నట్లు చెప్పారు. అలాగే మంచి అవకాశంతో పాటు అన్ని కుదిరితే బాలీవుడ్లో కూడా ఎంట్రీ ఇస్తాను అని ఒక మాట అనేశాడు. అప్పుడు ఎవ్వరు దాని గురించి పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అదే హాట్ టాపిక్ అయింది ఎందుకంటే…

మొన్ననే బాలీవుడ్ హీరో టైగర్ ష్రాప్ హైదరాబాద్ లో ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్బంగా తనకు అల్లు అర్జున్ అంటే అభిమానం అంటూ పేర్కొన్నాడు. అల్లు అర్జున్ స్టైల్ ను తాను అభిమానిస్తానని నాకు అల్లు అర్జున్ తో కలిసి నటించాలనే కోరిక ఉందని కూడా టైగర్ వ్యాఖ్యలు చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. బాలీవుడ్లో ఇప్పుడిప్పుడే స్టార్ డంను దక్కించుకుంటున్న టైగర్ తో కలిసి బన్నీ ఒక సినిమా చేస్తే హిందీ ఎంట్రీ బాగుంటుందనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.

బన్నీ తెలుగు సినిమాలు హిందీలో డబ్ అయ్యి ఛానెల్స్ లో యూట్యూబ్ లో రచ్చ చేస్తున్న విషయం తెల్సిందే. హిందీ ప్రేక్షకుల్లో ఇప్పటికే బన్నీ నోటెడ్ అయ్యాడు. ప్రస్తుతం మల్టీస్టారర్ చిత్రాల ట్రెండ్ నడుస్తుంది కనుక వీరిద్దరి కాంబో మూవీకి భారీ ఆధరణ దక్కే అవకాశం ఉంది. మరి బన్నీ ఆలోచన ఏంటో చూడాలి.

Tags : Allu Arjun, Bollywood. Only 4 Mega Fans

Write a comment ...
Post comment
Cancel