back

టాక్సీవాలా మూవీ టీంకి అల్లు అర్జున్ రాయల్ పార్టీ



Share via:

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ టాక్సీవాలా మూవీ టీంకి తన స్టైల్ లో గ్రాండ్ రాయల్ పార్టీ ఇచ్చాడు. హైదరాబాదులోని ప్రముఖ బి - డబ్స్ పబ్ లో చిత్ర యూనిట్ కి ఈ పార్టీని అరేంజ్ చేసాడు.

ఈ పార్టీకి టాక్సీవాలా మూవీ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ ప్రియాంక జవాల్కర్, చిత్ర దర్శకుడు మరియు ప్రొడ్యూసర్ ఎస్.కే.ఎన్ లతో పాటు ఇండస్ట్రీలోని కొత్త దర్శకులను ఈ పార్టీకి బన్నీ ఆహ్వానించాడు.

నవంబర్ 17వ తేదీన విడుదలయిన ఈ చిత్రం అద్బుతంగా ప్రదర్శింపబడుతుంది. ఈ చిత్ర విజయంతో మూవీ టీం ఎంతో ఆనందంతో మరియు మన 'రౌడీ విజయ్' అయితే ఫుల్ హ్యాపీ గా ఉన్నాడంట. నోటా ఫ్లాప్ తో కొంచెం డౌన్ అయిన విజయ్... ఈ చితంతో మల్లి తన స్థాయిని చుఇంచాడని ఫిలింనగర్ వర్గాల టాక్.

allu arjun party photos with taxiwaala movie team

ఎప్పుడు కొత్త టాలెంట్లని, కొత్త దర్శకులని ప్రోత్సహించే బన్నీ ఈ చిత్రాన్ని కూడా అభినందించాడు.

ఇంతకముందు 'పెళ్లి చూపులు', 'మహానటి' చిత్రాలను కూడా బన్నీ తన స్టైల్ లో ప్రోత్సహించాడు.

Tags : Allu Arjun, Taxiwaala, Vijay Deverakonda, Priyanka Jawalkar

Write a comment ...
Post comment
Cancel