back

అల్లు అర్జున్ నెక్స్ట్ త్రివిక్రమ్ తోనా ..?



Share via:

నా పేరు సూర్య సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుంటున్న అల్లు అర్జున్, ఇప్పుడు షూటింగ్ లో బిజీ కావాలని డిసైడ్ అయ్యారని అంటున్నారు. మరి డైరెక్టర్ ఎవరు అనేది మాత్రం ఇంకా తేలలేదు. మనం డైరెక్టర్ విక్రం కుమార్ తో ఒక తెలుగు-తమిళ్ బాషా చిత్రం చేయాలనుకున్న బన్నీ, కథా చర్చలు సరిగా జరగక పోవడంతో ఆ సినిమా ఆగిపోయిందని అంటున్నారు.

అరవింద సమేత సినిమాతో మళ్ళి ఫార్మ్ లోకి వచ్చినట్లు కనిపిస్తున్న త్రివిక్రమ్ తో బన్నీ నెక్స్ట్ సినిమా ఉండబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అరవింద సమేత ప్రమోషన్ ఇంటర్వ్యూలో వెంకటేష్-బన్నీ-మహేష్ బాబు ఈ ముగ్గురితో భవిష్యత్తులో చేసే అవకాశాలు ఉన్నాయని కథ కుదరాలి కదా అంటూ త్రివిక్రమ్ చెప్పాడు కానీ ఏది ముందు ఉంటుంది అనే క్లారిటీ ఇవ్వలేదు. ప్రాక్టికల్ గా చూసుకుంటే వెంకటేష్ ఎఫ్2 తో పాటు వెంకీ మామ షూటింగ్స్ లో బిజీగా ఉన్నాడు. మహేష్ బాబు మహర్షి ఏప్రిల్ 5 విడుదల అయ్యాకే ఫ్రీ అవుతాడు. సో అందుబాటులో ఉన్నది అల్లు అర్జున్ ఒక్కడే. సో ఈ కాంబోకె ఎక్కువ ఛాన్స్ ఉందని ఫిలిం నగర్ టాక్. 

మరి జులాయి, సన్ అఫ్ సత్యమూర్తి మేజిక్ మళ్ళి రిపీట్ అవుతుందేమో చూడాలి.

Tags : Allu Arjun, Trivirkram Srinivas

Write a comment ...
Post comment
Cancel