back

ఓవర్సీస్ లో కష్టపడుతున్న అల్లు అర్జున్



Share via:

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి తెలుగు రాష్ట్రాల్లోనే కాక కేరళలో కూడా మంచి ఆదరణ ఉంది కానీ ఓవర్సీస్ లో మాత్రం తన స్టామినా చూపించలేకపోతున్నాడు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి వాళ్ళు తమ ఫ్ఫ్లాప్ సినిమాలతో కూడా అలోవోకగా 2 మిల్లియన్ వసూళ్లు చేస్తుంటే, ఇక్కడ 70 కోట్ల పైన వసూళ్లు రాబట్టిన 'సరైనోడు' కూడా అక్కడ ఆ ఫీట్ సాధించలేదు. ఈ మధ్యనే రాంచరణ్ తనకు ఓవర్సీస్ లో ఉన్న అడ్డంకులను చెరిపేసుకుంటూ రంగస్థలంతో ఏకంగా బాహుబలి తర్వాత 3.5 మిలియన్ వసూలు చేసిన ఏకైక సినిమాగా 3వ స్థానంలో నిలబెట్టాడు. కానీ అల్లు అర్జున్ తన సినిమా 'నా పేరు సూర్య' కి కనీసం ఒక మోస్తరు ఓపెనింగ్స్ కూడా రాబటలేకపోవడం అనేది అభిమానులను, పంపినిదారులను కలవరపెడుతుంది.

ఎందుకు బన్నీ ఇలా అని ఆలోచిస్తే ఒక విషయం మాత్రం అర్థం అవుతుంది, అదేంటంటే బన్నీ సెలెక్ట్ చేసుకుంటున్న కథలు మరియు దర్శకులు...
ఓవర్సీస్ లో ఎక్కువగా కుటుంభం మొత్తం చూడదగిన కథా సినిమాలకే ఆదరణ ఉంటుంది అలాగే దర్శకులను కుడా చూస్తారు. రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్ లాంటి వాళ్ళకి అక్కడ మంచి డిమాండ్ ఉంది. మరి బన్నీ వరుసగా మూడు సీరియస్ మాస్ సినిమాలు అందులో పెద్దగా ఓవర్సీస్ లో బలం లేని దర్శకులు. అందుకే ఇలా అవుతుంది.!
బన్నీ ఇప్పటికైనా మళ్ళి ఒక జులాయి, రేసుగుర్రం, సన్ ఆఫ్ సత్యమూర్తి లాంటి సినిమాలు తీస్తే బ్రహ్మరథం పట్టడానికి ఓవర్సీస్ ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు అని ఈ మధ్యనే కొందరు అల్లు అర్జున్ అభిమానులు యుఎస్ లో పేర్కొన్నారు. మరి చూద్దం బన్నీ నుంచి అటువంటి సినిమానే రాబోతుందేమో...

Tags : Allu Arjun, Overseas, Naa Peru Surya Naa Illu India, DJ, Sarainodu

Write a comment ...
Post comment
Cancel