ఈ రోజుల్లో అనే సినిమాతో దర్శకుడిగా తొలి విజయం అందుకున్న మారుతి తరువాత కాలంలో భలే భలే మగాడివోయ్, బాబు బంగారం లాంటి సినిమాలతో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. మొదటి నుంచి ఈయనికి మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఉండగా అందులో ముఖ్యంగా అల్లు అర్జున్ సపోర్ట్ ఎక్కువగా ఉంది. అందుకే అల్లు శిరీష్ కొత్త జంట లాంటి మంచి సినిమా చేసారు మారుతి.
మరి బన్నీ తో మారుతి సినిమా ఎపుడు అనేదానికి సమాధానంగా ఈమధ్యే మారుతి ఒక ఇంట్రెస్టింగ్ కథను అల్లు అర్జున్ కు వినిపించాడట. అయితే బన్నీ కథలో కొన్ని మార్పులు చేర్పులు సూచించడం దానికి మారుతి సరే అనడం జరిగిపోయింది అంట. వీలైనంత త్వరగా కథలో మార్పులు చేసి బన్నీని ఇంప్రెస్ చేసే పనిలో పడ్డాడని టాక్. అంతా సవ్యంగా జరిగితే ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్తుందట.
బన్నీ ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. మారుతి స్క్రిప్ట్ కనుక నచ్చితే త్రివిక్రమ్ సినిమాతో పాటుగా ఈ సినిమాపై కూడా ప్యారలల్ గా పని చేసేందుకు బన్నీ రెడీగా ఉన్నాడట. అంటే ఇక 'నా పేరు సూర్య' తర్వాత వచ్చిన గ్యాప్ ను ఇలా రెండు సినిమాలతో కవర్ చేయాలని అల్లు అర్జున్ అనుకుంటుండగా ఇక ఫాన్స్ కి పండగే...
Tags : Allu Arjun, Maruti