back

నాకు సౌత్ ఇండియా అంటే పిచ్చి : అల్లు అర్జున్



Share via:

నిన్న సాయంత్రం హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ లో లవర్స్ డే సినిమా ఫంక్షన్ ఎంతో వైభవంగా సాగింది. సుఖీభవ డెవలపర్స్ అధినేత గురురాజ్ ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తూ వేడుకను అంతే ఘనంగా జరిపించారు. ఈ వేదికపై కొత్త కుర్రాడు రోషన్ ని - ప్రియాని బన్ని ప్రత్యేకంగా అభినందించారు. కెరీర్ పెద్ద రేంజుకు ఎదగాలని ఆశీస్సులు అందించారు.


ఈ వేదికపై బన్ని మాట్లాడుతూ -``ఇటీవల జాతీయ స్థాయిలో వైరల్ అయిన ఒరు ఆధార్ లవ్ టీజర్ అంటే నాకూడా బాగా ఇష్టం. నాకు సౌతిండియా అంటే ఇష్టం. నేనెవరో చెప్పాల్సి వస్తే.. సౌతిండియన్ హీరో అని అంటాను. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్.. చెన్నయ్ లలో .. తెలుగు - తమిళంతో పాటు కేరళ - కర్నాటక లోనూ నన్ను ఆదరిస్తున్నారు. నన్ను మలయాళంలో ఎంతో ఆదరించారు. నా సినిమాల్ని వాళ్లు ఆదరిస్తున్నందుకు అయినా.. వాళ్ల సినిమాలు మన భాషలోకి వచ్చేప్పుడు ఎంకరేజ్ చేయాలి కదా అనిపించి ఈ వేడుకకు వచ్చాను. టీమ్ కి ఆల్ ది బెస్ట్. ఈ సినిమాకి ఇంత క్రేజు తెచ్చిన హీరో రోషన్ అబ్ధుల్ .. ప్రియా వారియర్ కి కంగ్రాట్స్`` అని అన్నారు.

బన్నీ పైకి తూటా పేల్చిన ప్రియ..

Tags : AlluArjun, LoversDay Audio Launch

Write a comment ...
Post comment
Cancel