back

'సైరా'లో అల్లు అర్జున్



Share via:

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఉయ్యాలవాడ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సైరా నరసింహ రెడ్డి చిత్రంలో అల్లు అర్జున్ కూడా ఒక ముఖ్య పాత్రని పోషిస్తున్నాడు. కాని అది మరో రూపంలో.

సైరా చిత్రానికి గాను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నట్టు సమాచారం. ఈ సినిమా మాటలతో మొదలవ్వబోతుందని, ఆ మాటలు అల్లు అర్జున్ చెబితే బాగుంటుందని బావించిన దర్శకుడు సురేందర్ రెడ్డి, ఈ విషయాన్ని చిరంజీవికి చేరవేయగా... చిరు కూడా ఒప్పుకున్నట్టు వినికిడి.

ఇప్పటివరకు తన తదుపరి చిత్రాన్ని వెల్లడించని బన్నీ అభిమానులకి ఈ వార్త చాలా ఆనందాన్ని ఇస్తుంది.

Tags : Allu Arjun, Syeraa Narasimha Reddy, Megastar, Chiranjeevi

Write a comment ...
Post comment
Cancel