back

సైరా లో అల్లు అర్జున్ ..?



Share via:

రాంచరణ్ తన కొణిదెల ప్రొడక్షన్స్ పైన తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో 200కోట్ల భారీ బడ్జెట్ తో తీస్తున్న సినిమా “సైరా నరసింహారెడ్డి”. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 70% పైనే పూర్తయిందని వినికిడి. గ్రాఫిక్స్ పని చాలా ఉన్న కారణంగా వేసవికి అనుకున్న సినిమా విడుదల దసరాకి మార్చుకున్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు ఏఎ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒక అతిధి పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి నిహారిక ఈ సినిమాలో నటిస్తుండగా ఇక బన్నీ నటించడం కూడా నిజమైతే ఇక అభిమానులకు అది పండగే.


ఇక ఈ చిత్రంలో సుదీప్, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, జగపతిబాబు వంటి స్టార్ లు నటిస్తుండగా నయనతార కథానాయికగా నటిస్తుంది. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా లో ఇప్పుడు అల్లు అర్జున్ నటిస్తున్నాడనే వార్త ..ఇంకా అంచనాలు పెంచేస్తుంది.

Tags : Syeraa, Chiranjeevi, Allu Arjun

Write a comment ...
Post comment
Cancel