back

కపిల్ దేవ్ బయోపిక్ లో అల్లు అర్జున్!



Share via:

ప్రముఖ మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించనున్నట్టు సమాచారం.

బాలీవుడ్లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో రన్వీర్ సింగ్ లీడ్ రోల్ చేయ్యనుండగా కబీర్ ఖాన్ దర్శకత్వం వహించనున్నారు. అయితే ఈ చిత్రంలో కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్ర కోసం చిత్ర యూనిట్ అల్లు అర్జున్ ని సంప్రదించారంట. మరి ఆ పాత్రలో నటించడానికి అల్లు అర్జున్ ఒప్పుకున్నారో లేదో అధికారికంగా వెల్లడి కాలేదు.

ఒకవేళ ఈ పాత్రని గనక బన్నీ చేసినట్టైతే అల్లు అర్జున్ బాలీవుడ్ తెరంగ్రేటానికి బీజం పడినట్టే. మరి కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్రలో బన్నీ ఉన్నాడో లేదో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే.

ప్రస్తుతం అల్లు అర్జున్ విక్రం.కే.కుమార్ తో జత కట్టబోతున్నట్టు వార్తలు వస్తున్నప్పటికీ అధికారికంగా ఏ విషయం వెల్లడి కాలేదు. బన్నీ విక్రం తో పాటు మరికొంతమంది తమిళ దర్శకులని లైన్లో పెట్టినట్టు సమాచారం.

Tags : Allu Arjun in Kapil Dev Biopic, Bunny, Krishnamachari Srikanth

Write a comment ...
Post comment
Cancel