back

మెగా కన్ఫ్యూషన్లో పడ్డ అల్లు అర్జున్



Share via:

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు మెగా కన్ఫ్యూషన్లో పడ్డాడు. 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమాతో ఒక్కసారిగా నీరసిన్చిపోయిన అల్లు అర్జున్ తదుపరి ఏ సినిమా చెయ్యాలో నిర్ణయించుకోలేక సందిగ్ధంలో ఉన్నాడట.

కొద్దిరోజుల కిందట నా పేరు సూర్య విడుదలకి ముందు కాబోయే సౌత్ ఇండియన్ స్టార్ గా ఒక వెలుగు వెలిగిన మన స్టైలిష్ స్టార్ ఇప్పుడు ఏ సినిమాని ఫైనల్ చెయ్యక ఎవర్తో సినిమా చెయ్యాలో అర్ధం కాకుండా ఉన్నాదంటా.

తన తదుపరి చిత్రం 'మనం' ఫేం విక్రం కే కుమార్ డైరెక్షన్లో ఉంటుంది అని ఇంతకముందే చెప్పిన బన్నీ... ఇప్పుడు ఆ స్క్రిప్ట్ ఇంకా ఫైనల్ అవ్వకపోవడంతో తమిళ డైరెక్టర్ లింగుస్వామి ని కూడా పిలిపించినట్టు వినికిడి...

రెండేళ్ళ కిందటే లింగుస్వామి దర్శకత్వంలో సినిమా చెయ్యాల్సి ఉన్న స్క్రిప్ట్ నచ్చకపోవడంతో వెనక్కి తగ్గాడు బన్నీ. కానీ... లింగు ఈ సారి కూడా బన్నీని తన కథతో మెప్పించాలేకపోయాడు.

ఇక బోయపటితో మరోసారి జతకట్టుదం అనుకున్న మన స్టైలిష్ స్టార్... బోయపాటి కమిట్మెంట్ వళ్ళ వేచి చూడాల్సిన ధోరణి.

ఇప్పటికే నా పేరు సూర్య ఫ్లాప్ వల్ల ఆచితూచి అడుగేస్తున్న అల్లు అర్జున్ తన తదుపరి సినిమాని ఎప్పుడు ప్రకటిస్తాడో వేచి చూడాల్సిందే.

Tags : allu arjun in confusion, naa peru surya naa illu india, nsni, stylish star

Write a comment ...
Post comment
Cancel